రాయికల్ మండలం ఇటిక్యాల సెక్టార్ పరిధిలోని చెర్లకొండాపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దువ్వాక రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా సర్పంచ్ దువ్వాక రవి మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం ఎంతో కీలకమని, ప్రతి తల్లి సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు చిన్నారులకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ తల్లులకు పలు సూచనలు చేశారు. పోషణ మాసం కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తల్లులు, పిల్లల్లో ఆరోగ్యంపై మరింత అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కే. నవ్యశ్రీ, ఉప సర్పంచ్ ఆర్మూరి లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ ఆకుల రాజ్యలక్ష్మి. అంగన్వాడీ టీచర్ సఫియా, ఆయమ్మ ఆర్మూరి నర్సు, వార్డు సభ్యులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Comments 0