నల్గొండ జిల్లాలో అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన PRTUTS ఆరవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో రామగుండం మండలానికి చెందిన ఎనిమిది మంది నాయకులు రాష్ట్రస్థాయి బాధ్యతలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా గూళ్ల అంజన్ కుమార్, పెర్కారి శ్రీధర్ రావు, కుంట రామన్న, వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, రాష్ట్ర కార్యదర్శులుగా దూడం శ్రీనివాస్, బూర్తుల సుభాష్, బజ్జూరి ప్రసాద్, బిల్లా సంపత్ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకులకు PRTUTS రామగుండం మండల శాఖ అధ్యక్షుడు తాండ్ర ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెరటి రవీందర్, మండల కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలకు సహకరించిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శి భట్టాపురం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్లకు రామగుండం మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.



Comments 0