పరీక్షలకు వెళ్లే విద్యార్థుల భద్రత దృష్ట్యా రామగుండం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో, సబ్ ఇన్స్పెక్టర్ జి. హరి శేఖర్ సమక్షంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ఈ సందర్భంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సులు, ఆటోలు తదితర వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. వాహనాలు నడిపే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. తనిఖీల్లో ఒక ఆటో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు.ఆ సమయంలో ఆటోలో పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు ఉండటంతో సబ్ ఇన్స్పెక్టర్ జి. హరి శేఖర్ స్వయంగా విద్యార్థులను సురక్షితంగా దింపి వారికి ఇతర వాహనాల ద్వారా పరీక్ష కేంద్రాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం మద్యం సేవించి వాహనం నడిపిన ఆటో డ్రైవర్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు మాట్లాడుతూ, పరీక్షలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు వారు ఎక్కే వాహనం మరియు డ్రైవర్ పరిస్థితిని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రత కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

Comments 0