గోదావరిఖని నగరంలోని మార్కండేయ మండల్ శారదా నగర్ శిశు మందిర్‌లో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త కరీంనగర్ విభాగ ప్రచారక్ భానుచందర్ మాట్లాడుతూ కుటుంబ విలువలు, స్వదేశీ జీవనం, పర్యావరణ హిత జీవన విధానమే ప్రపంచ సంక్షేమానికి మూలమని పేర్కొన్నారు. సంఘం పరివర్తన కార్యక్రమం ద్వారా వ్యక్తి, కుటుంబం, సమాజం మార్పు ద్వారా దేశ వైభవాన్ని సాధించడం లక్ష్యమని ఆయన అన్నారు. రాజ్యాంగం చూపిన బాటలో పౌర విధులను పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. సంఘం శతాబ్ది ఉత్సవాల భాగంగా ప్రతి బస్తీ, ప్రతి గ్రామంలో జాతీయ భావన, సేవా భావనను పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ్ సభ్యులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.