దున్నే వాడిదే భూమి, కంపనీలో పని చేసేవాడిదే ఉత్పత్తి లాంటి సొగసైన అందమైన నినాదం తో సామాన్యుల బుర్రల్లో ఆశలు నింపి తమ గల్లాలు నింపుకున్న సిద్ధాంతం ఏదయినా ఉంది అంటే అది కమ్యునిజం సిద్దాంతం ఒక్కటే. కాని చరిత్రలోకి తొంగి చూస్తే నక్షలిజమ్ పేర మన దేశం లోనే కాకుండా ఆ సిద్ధాంతం మొదలైన రష్యా చైనా లో కూడా ఆ సిద్ధాంతం ఒక విఫల సిద్దాంతంగా మిగిలి పొయింది. కాని ఇప్పటికీ మన దేశం లో కుహనా కమ్యునిజం వాదులు కమ్యునిజం సోషలిజం అంటూ నీతి వాక్యాలు చెబుతూ అమాయకుల బుర్రలు నింపేస్తునే ఉంటారు. మనలో కూడా చాలామంది వారి మాటలు నమ్మి కమ్యునిజం సిద్దాంతం మంచిదే కానీ ఆచరణ సాద్యం కానిది అని అంటూ ఒకరకమైన బ్రమలో మాట్లాడుతూ వుంటారు. మరి మంచి సిద్దాంత మైతే అది పుట్టిన చోట కూడా ఎందుకు విఫల మైనది. అలాగే కమ్యూనిజాన్ని అనుసరించిన దేశాలు కమ్యునిజం స్థానం లో కర్పోరేటికరణ ఎందుకు చేసారు. మావోయిజం పేరిట రైతుకు ఇచ్చిన భూమిని మల్లి ఎందుకు లాక్కున్నారు మల్లి ఎందుకు రైతులకు హక్కులు కల్పించారు వ్యవసయవిధానం లో కర్పోరేటికరణ ఎందుకు తీసుకు వచ్చారు అంటే సమాధానాలు చెప్పరు. అసలు ఈ సమాచారం ఎందుకు సమాజానికి తెలియనివ్వరు అనేది కోట్ల రూపాయల ప్రశ్న . దీనికి తోడు కొందరు మేధావుల ముసుగులో యువత నక్సలిజం వైపు మరలె విదంగా పాటలు నృత్యాలు కవితలు కథలు కాకరకాయలు రాసి యువత నక్షలిజమ్ వైపు వెళ్ళేల ప్రేరేపిస్తుంటారు . అలంటి వారిలో ప్రధాన మైన వ్యక్తి గద్దర్ వరవరరావు విమలక్కలు . గద్దర్ గురించి తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వుండరు ఈ విషయంలో అంతటి ప్రాముక్యత సాధించు కున్నారు. గ్రామగ్రామాన తిరిగి తన ఆటపాటలతో యువతను ఉద్రేక పరచారు . దీంతో అయన పాటల మూలంగా వేలాది మంది యువత నక్షలిజమ్ ప్రబావానికి గురై అడవుల పట్టారనే విమర్శలు అనేకం ఉన్నాయి. అలగే శ్రీశ్రీ లాంటి వారు పేదలు, ఆకలి కలయికలతో ఎన్నో కవితలు రాయడం మూలంగా యువత ఒకవిదమైన ప్రబుత్వ | రాజ్యవ్యతిరేక బావనకి లోనయ్యారు . అలగే అరుణోదయ కలమండలి పేరుతో విమలక్క లాంటి వారు కూడా ఇక్కడ అర్బన్ నక్సల్ కింద మనం మాట్లాడుకోవచ్చు. నాడు అంటే నక్షలిజమ్ భారత దేశం లో ప్రవేశించే క్రమంలో అంటే 1967 లో మొదటగా నక్షల్బరిలొ ప్రారంబమై మన దేశం లో దాదాపు 20 రాష్ట్రాల్లో 182 జిల్లాల్లో దాని ప్రబావం చూపినప్పటికీ ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ , జార్ఖండ్ ,ఒడిష ,వెస్ట్ బెంగాల్ ,బిహార్ ,తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ ,మహారాష్ట్ర లలో 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది . అదికూడా నేదో రేపో అంతం కానుంది ఈమేరకు ఈ దేశపు హోంమంత్రి అమిత్ షా 2026 డిసెంబర్ నాటికి నక్షలిజమ్ లేకుండా చేస్తామని ప్రకటించారు. అయితే నేడు ఈ నక్షలిజమ్ అర్బన్ నక్సలిజం గ మారడమే కాకుండా నాటి దున్నే వాడిదే బూమి నినాదం నుండి పని చేసే వాడిదే కంపని లాభం అనేంతగా ఎదిగింది . కాని దీనికి ఏ సమాజాన్ని రెచ్చగొట్టి విప్లవం తీసుకు రావాలని చూసారో ఆ సమాజం నుండే మద్దతు కరువు అవడం తో ఇప్పుడు కొత్తగా కులాల పేరుతో మతాల పేరుతో కుల అంతరాల పేరుతో వీరి బావజాలం ప్రవహిస్తోంది. అది అలా ఉన్నప్పటికీ అసలు ఈ మావోయిజం లెనినిజం నక్సలిజం పుట్టిన రష్యా చైనల్లోనే కనుమరుగయ్యింది. అసలు ఈ నక్సలిజం కారణంగా రష్యా చైనాల్లో 1917 నుండి 1930 వరకు దాదాపు 10 కోట్ల ప్రాణాలు గాల్లో కలిసి పొయ్యాయి. మొదట సోషలిజం కమ్యునిజం పేరుతో కారల్ మార్క్స్ విదానాలంటూ 1920 , 1930 ప్రాంతాల్లో భూమి కలెక్ట వైజేషణ్ పేరుతో రైతుల దగ్గరి నుండి భూములను లాక్కుని ప్రభుత్వం దగ్గరే పెట్టుకొని వ్యవసాయం చేయించారు. దీంతో ఉక్రెయిన్ లో తీవ్ర కరువు సంభవించి ఆకలితో కూడా లక్షలాది మంది చనిపోయ్యారు . దీనికి కారణం భూమి ప్రభుత్వం దగ్గర వుండడం తో ఎవరు సరయిన పద్దతిలో పని చెయ్యక పోవడమే. కాని చేసినట్లుగా దొంగ లెక్కలు చూపించి ప్రజా ధనాన్ని మాత్రం కాజేశారు . కానీ మార్కెట్లో నిత్యావసర సరుకులు లేకపోవడం తో ఆకలితో లక్షలాది మంది చని పొయ్యారు. ఇక చైనాలో కూడా లెనిన్ మావోల ప్రబావం తో సోషలిజం పేర 1953-1958 మావో జెడాంగ్ సమానత్వం పేరిట ప్రజల భూములు లాక్కోబడ్డాయి. ప్రజలు తమ భూములు ఇవ్వడానికి నిరాకరించడం తో రక్తపుటేరులు పారించి బలవంతంగా భూములు లాక్కున్నారు . ఇక్కడ కూడా సేం రష్యాలో జరిగినట్లుగానే ఆహారకొరత ఏర్పడింది. మొదట్లో కొంత మెరుగ్గా అనిపించినా 1978 నాటికి పరిస్థితి దిగజారిపోయింది. వ్యవసాయ ఉద్యోగులు అందరు కూడా దొంగ లెక్కలు చూపించి ప్రజా ధనాన్ని కాజేశారు. చేసేది లేక చైనా తిరిగి భూములను లీజుకు ఇచ్చే పద్ధతి తీసుకు వచ్చి ఈ విషయం లో ప్రవేటు బాగస్వామ్యాన్ని కలిపింది. కాని ప్రస్తుతం అటు రష్యాలో కాని ఇటు చైనా లో కాని వ్యవసాయ భూములన్నీ కూడా కార్పొరేట చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చైనా రష్యాలలో సామాన్య రైతులు వ్యవసాయం చేయలేక కార్పోరేట్ సంస్థలకు తమ భూములను అమ్మేసుకుంటున్నారు దీంతో ఇప్పుడు vరష్యాలో వ్యవసాయ భూములలో గణనీయమైన భాగం పెద్ద వ్యవసాయ సంస్థలు మరియు కార్పొరేట్ హోల్డింగ్స్ వద్ద ఉంది. 2023 నాటికి, 73 ప్రధాన సంస్థలు 17.4 మిలియన్ హెక్టార్ల భూమిని నియంత్రిస్తున్నాయి, ఇందులో టాప్-5 సంస్థలు 4.4 మిలియన్ హెక్టార్లను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, Prodimex, Rusagro, Miratorg వంటి సంస్థలు పెద్ద ఎత్తున భూములను కలిగి ఉన్నాయి. చైనాలో కూడా 1978 డెంగ్ సంస్కరణల తర్వాత, చిన్న రైతు ఫామ్‌లు (0.5 హెక్టార్) పెద్ద సంస్థలకు లీజ్ చేస్తున్నాయి. 2025 నాటికి, 30% వ్యవసాయ భూమి పెద్ద ఫామ్‌లలో చేరిపోయింది . ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నక్షలిజమ్ మన దేశం లోకి 1967 ప్రాంతం లో బెంగాల్ లోని నక్సల్ బరి లో మొదటగా కనపడి దేశం లోని 20 రాష్ట్రాలలోని 182 జిల్లాలకు పాకింది. మన తెలుగు ప్రాంతం లో ముఖ్యమైన వారిలో కొండపల్లి సీతారామయ్య ,నంబాల కేశవరావు .వెంపటాపు సత్యనారాయణ , ఆదిబట్ల కైలాసం , నల్ల యాది రెడ్డి , సుబ్బారావు పాణిగ్రాహి ,సంతోష్ రెడ్డి , శీలం నరేష్ , కట్టా రామచంద్ర రెడ్డి , సుజాత లాంటి వరెందరో కనపడుతారు. ప్రస్తుతం వీరి లో చాల వరకు పొలిసు ఎన్ కౌంటర్ లలో చని పొయ్యారు . నక్షలిజమ్ ఎక్కడ అయితే పురుడు పోసుకున్తుందో అక్కడ అభివృద్ధి అన్న మాటే ఉండదు. నక్షలిజమ్ సిద్ధాంతం మావో లెనినిజం సిద్ధాంతం ల పేరుతో దాదాపు 30 సంవత్సరాల పాటు బెంగాల్ ను పాలించిన జ్యోతి బసునే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెంగాల్లో ఎలాంటి దరిద్రం వుందో మనం కళ్ళార చూస్తున్నాము . నక్సలిజం ఉనికి ఎక్కడ అయితే కనపడుతుందో అక్కడ ఒక రోడ్డు వేయనివ్వరు ఒక విద్యుత్ ఫెసిలిటి రానివ్వరు అంత చీకటి మయం. ఇలా అభివృద్ధి లేని ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయో చెప్పమంటే వీళ్ళ దగ్గర సమాదానం ఉండదు. తుపాకి అండన ప్రజలను కాపు కాస్తూ పైగా రాజ్యం హింసిస్తోంది అంటారు. అయిన దానికి కాని దానికి సాటి మనుషుల్ని చంపుకుంటూ వెళ్ళే వీళ్ళకు రాజ్యం హింసిస్తోంది అనే అర్హత ఎవరిచ్చారు . ఒకప్పుడు కమ్యునిజం ఏలిన ప్రపంచం లోని ఎన్నో దేశాలు సోవియట్ యూనియన్, చైనా , క్యుభా , వియత్నాం , ఉత్తర కొరియా , తూర్పు ఐరోపా దేశాలు , లాటిన్ అమరిక దేశాలు ఇప్పుడు ప్రజాస్వామ్యం వైపు నడుస్తున్నాయి . ఇదే మావోయిజం పుట్టిన రష్యా చైనాలో ఇప్పుడు నక్షలిజమ్ అంటే తూటాలతో జల్లెడ పడుతారు. కాని మన దేశం లో మాత్రం ఇంకా మేము తుపాకి తో రాజ్యాధికారం సాదిద్దామంటూ యువతను రెచ్చ గొడుతున్నారు . మందు పాతరలు పేల్చి సాటి మనుషులను రాక్షసుల మదిరి పొట్టన పెట్టుకుంటున్నారు. మనం ఇది వరకు కూడా వీడియోల్లో చర్చించుకున్నాము మన దేశం లో కేవలం నక్సలిజం కారణంగా దాదాపు 50 వేల మంది భారతీయులు చనిపోయ్యారు . ఇందులో చని పోయిన వారిలో 99.99 శాతం సామాన్య పేదలే ఉన్నారు. వీరంతా ఏమి పాపం చేసారు ఈ కమ్యునిజం నక్సలిజం సిద్దాంతాల కొరకు సామాన్యులు తమ ప్రాణాలు ఇస్తుంటే ఇదే సిద్దాంతాన్ని వాడుకున్నన్ని రోజులు వాడుకొని చివరకు జన జీవన స్రవంతి పేరుతో కోట్లాది రూపాయల ప్రజదనం పోగేసుకొని సామాన్యుడిల సన్నాయి నొక్కులు నొక్కడం దేనిని సూచిస్తుంది. ఇది యువత అర్ధం చేసుకుంటే నక్సలిజం లేదా మావోయిజం అనే మాట నోట్లోంచి వచ్చినా కూడా వాడిని అక్కడికక్కడే జనం ఉప్పు పాతర వేస్తారన్నది నగ్నసత్యం. న్యాలకొండ అనిల్ రావు దేశాయి సామాజిక విశ్లేషకులు 9912009171