శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని రాం మందిర్ శ్రీ రామాలయంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గోదావరిఖని కిరాణ మర్చంట్ అసోసియేషన్ మరియు రైస్ మిల్లర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు ఉచితంగా పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. గత 12 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో నిర్వహించబడింది. కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రియతమ నాయకులు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నేతృత్వం కీలకంగా నిలిచింది. మేయర్ మహంకాళి స్వామి, కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ సహకారంతో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పూజలు, ప్రత్యేక హోమాలు, భజనల మధ్య భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి శ్రీరాముడి దర్శనం పొందారు. అనంతరం అందరికీ ప్రసాదంగా పులిహోరను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు చొక్కారపు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల కిషోర్ కుమార్, కోశాధికారి రేణికుంట చందర్, ఉపాధ్యక్షులు నగునూరి సత్యప్రసాద్ మరియు ఇతర సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Comments 0