రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీలలో కాలువపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి వరద కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, రూ.4 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టనున్న ఈ పనులు త్వరగా పూర్తైతే వర్షాకాలంలో వరద ముంపు సమస్య ఉండదన్నారు. శనివారం నుంచి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వడ్లూరి రవి, గట్ల రమేష్, చిదురాల నాగరాజు, బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.