రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పద్మావతి కాలనీకి బీఆర్‌ఎస్ నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి గురువారం పర్యటించారు. కాలనీ వీధుల్లో స్థానికులతో ముచ్చటించి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీ అసోసియేషన్ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై కాలనీ అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై చర్చించారు. రానున్న కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెరటి ప్రభాకర్ రెడ్డి, అంబటి సతీష్,శెనం కిరణ్, సమెట విజయ్‌కుమార్, పోలాడి శ్రీనివాస్, అమ్మరాజు గురుస్వామి, భాస్కర్ రెడ్డి గురుస్వామి, బొంతల భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.