జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని సూక్ష్మ కళాకారుడైన స్వర్ణకారుడు బాలకృష్ణ వీరాభిమాని ఇల్లెందుల నాగేందర్ రేపు విడుదల కాబోయే అఖండ -2 చిత్రంలోని త్రిశూలాన్ని పంచ లోహాలతో స్వయంగా తయారుచేశాడు. ఈ త్రిశూలానికి గురువారం రోజు రాయికల్ పట్టణంలోని అతి పురాతనమైన గుడి కోట శ్రీ చెన్న కేశవనాథ ఆలయంలో అభిషేకం, పూజలు జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లెందుల నాగేందర్ మాట్లాడుతూ అతి సూక్ష్మ త్రిశూలాన్ని స్వయంగా నేనే వెళ్లి నందమూరి బాలకృష్ణకు బహుకరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మచ్చ శ్రీధర్, పిప్పోజి మహేందర్ బాబు, బూర్ల గంగన్న బత్తిని నిరంజన్ ఆలయ అర్చకులు మునుగోటి సతీష్ శర్మ పాల్గొన్నారు.