రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ మహంకాళి స్వామి తండ్రిని కలసి పరామర్శించారు. కాలు విరిగిన కారణంగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.