దేశంలో ఓ పెద్ద ఇస్లామిక్ ఉగ్రవాద ఆపరేషన్ ను భగ్నం చేసింది గుజరాత్ ఏటీఎస్. గుజరాత్ గాంధీనగర్ లోని అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్ లో ఉగ్రదాడికి ప్రణాళికలు వేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తుపాకులు, విషపూరిత రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోందని ఏటీఎస్ పేర్కొంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ కుమారుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, మహ్మద్ సులేమాన్ కుమారుడు మహ్మద్ సుహైల్ మరియు సులేమాన్ సైఫీ కుమారుడు ఆజాద్ అనే ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది.అరెస్టయిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ హైదరాబాద్ నివాసి. మొహమ్మద్ సుహెల్ మొహమ్మద్ సులేమాన్ మరియు ఆజాద్ సులేమాన్ సైఫీ ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నివాసితులు. ముగ్గురి వయస్సు దాదాపు 25 సంవత్సరాలు. ముగ్గురు ఉగ్రవాదులను ఓ సంవత్సరం పాటు నిఘాలో వుంచింది ఏటీఎస్. వారి లొకేషన్ ను నిరంతరం ట్రాక్ చేసి, వారి ప్రతి కదలికను పరిశీలించారు. ఈ ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు రైజిన్ అనే అత్యంత విషపూరితమైన ద్రవాన్ని తయారు చేస్తున్నారు.