గోదావరిఖని న్యాయవాది గుళ్ల రమేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం ఖని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం నినాదాలతో కోర్టు నుంచి ఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తౌటం సతీష్‌తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.