రాయికల్ పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని కేశవ నగర్, మత్తడి వాడలో అధిక సంఖ్యలో కోతులు సంచరిస్తూ, ఇంటి తలుపులు తెరుచుంటే చాలు లోనికి ప్రవేశించి, నిత్యవసర సరుకులు,పప్పులు, కూరగాయలు, తీసుకు వెళ్లడమే కాకుండా పిల్లలు,వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. చివరికి ఇండ్లలో చొరబడి అన్నం, కూరలు తింటున్నాయని అడ్డుకొ పోయిన ఇంటి యజమానుల మీద దాడులు చేస్తున్నాయని, కోతుల విధ్వంసం దాడుల నుంచి ప్రజలు ఇంటి తలుపులు మూసి వేసుకొని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఈ విషయమై మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి,వినతి పత్రాలు అందించిన స్పందించడం లేదంటు పలువురు కాలనీవాసులు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి కోతుల బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.