రాయికల్ పట్టణంలోని పెద్ద చెరువు వద్ద పార్క్ కోసం చదును చేసిన స్థలంలో చెట్లు పెట్టి క్రీడా పరికరాలు ఏర్పాటు చేయాలని మరియు రాయికల్ పట్టణంలోని పెద్ద చెరువు,ప్రభుత్వ ఆసుపత్రి, జగిత్యాల రోడ్డు ల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయాలని రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హానుమాండ్లుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆరెస్ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్,కౌన్సిలర్లు మారంపల్లి సాయి కుమార్,వల్లకొండ మహేష్ గౌడ్,శ్రీరాముల సువర్ణ సత్యనారాయణ పాల్గొన్నారు.