పాలకుర్తి మండలం తక్కళ్లపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం సాయితిరుమల్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు మంగళవారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గాయపడిన నాయకుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. సాయితిరుమల్ గౌడ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో కొనసాగాలని ఎమ్మెల్యే దంపతులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.