డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ వ్యక్తికి గోదావరిఖని ప్రిన్సిపల్ కోర్టు మేజిస్ట్రేట్ 3 రోజుల జైలు శిక్ష విధించారు. రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఈ మేరకు తీర్పు వెలువడింది. అనంతరం అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సూచించారు.

Comments 0