రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్‌లో బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు చేతి బోర్ పంప్‌కు మరమ్మత్తులు చేపట్టించారు స్థానిక కార్పొరేటర్ దొంత శ్రీనివాస్. డివిజన్‌లోని మదీనా మజీద్ వెనుక ఉన్న పోచమ్మ గుడి బస్తీలో చేతి బోర్ పంప్ పనిచేయకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బస్తీ ప్రజలు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కార్పొరేటర్ దొంత శ్రీనివాస్, ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, మున్సిపల్ మేయర్ మహంకాళి స్వామి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులతో మాట్లాడి బోర్ పంప్‌కు మరమ్మత్తులు చేయించారు. దీంతో బస్తీ ప్రజలకు తాగునీటి సమస్య తీరింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని డివిజన్‌లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. డివిజన్ ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని, ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ అధికారుల సమన్వయంతో డివిజన్ అభివృద్ధి కోసం పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, స్థానిక ప్రజలకు డివిజన్ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.