గోదావరిఖని స్థానిక కోదండ రామాలయంలో శుక్రవారం నిర్వహించిన హిందూ వాహిని సమావేశంలో గోదావరిఖని శాఖను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హిందూ వాహిని జిల్లా సంయోజక్ రాగం శ్రీధర్, సహ సంయోజక్ గోలివాడ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు కాంతాల సంతోష్ హాజరయ్యారు. యువ విభాగం నాయకులు చందనాల శివకుమార్, వెంకటేష్, వర్షిత్ వర్ధన్, జీవన్ శర్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోదావరిఖని శాఖ సంయోజక్‌గా కే. సునీల్‌ను, సహ సంయోజక్‌లుగా అల్కా ప్రశాంత్, బొంగాని రిషిక్‌లను నియమించారు. సమావేశంలో పలువురు యువకులు హిందూ వాహిని సంస్థలో చేరారు.దేశం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.