బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ను డంప్ యార్డ్ చేశారు. క్లీన్ చేసేవరకు ఇక్కడే కూర్చుంటాం. జనం గొంతు బ్యూరో చీఫ్ హైదరాబాద్ 28/03/26 శనివారం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ఇక్కడ ఉండబట్టి 24 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి రోజు పదివేల మంది కస్టమర్లు వచ్చి పోతుంటారు. సంవత్సరానికి 14 నుండి15 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే మార్కెట్ ఇది. గత తొమ్మిది నెలలుగా చెత్తను తీసుకువెళ్లే కాంట్రాక్టర్లు, టాయిలెట్స్ కడిగే కార్మికులకు డబ్బులు రాకపోవడం వల్ల వందల లారీల చెత్త పేరుకుపోయింది. ఆ మురిగిపోయిన కూరగాయల నుంచి వచ్చే దుర్గంధపూరితమైన నీళ్లు కాళ్ళ కిందకు వచ్చి పుండు పడిపోతున్నాయి. ఈ దుర్గంధపూరితమైన వాసన వల్ల కస్టమర్లు రావడం లేదు. మార్కెట్లో బిజినెస్ అంతా తగ్గిపోతుంది. మంత్రికి చెప్పినా, కమిషనర్ కి చెప్పినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇది కూరగాయల మార్కెట్ లాగా లేదు డంప్ యార్డ్ లాగా ఉంది. ప్రతినిత్యం రోగాలకు నిలయంగా ఉంది. మహిళ టాయిలెట్ కు వెళ్లాలంటే ఇంకో మహిళ కాపలా కాయాల్సి వస్తుంది. టాయిలెట్స్ కు నీళ్లు లేవు, డోర్లు లేవు అని మహిళలు చెబుతున్నారు. ఎంతో ఆరోగ్యపరంగా ఉండే ఈ మార్కెట్ యార్డ్ రోగాల నిలయంగా మారింది. ఇక్కడ కట్టిన వాటర్ ట్యాంక్ లో నీళ్లు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, చెత్తను మోసేవారు లేరు. ఈ రోజు నేను వస్తున్నానని తెలిసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. నేనిక్కడికి గంట రెండు గంటలు ధర్నా చేయడానికి రాలేదు. ఇక్కడ ఉన్న చెత్తంతా కూడా తీసేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయించాలి. శాశ్వతంగా అండర్ గ్రౌండ్ వ్యవస్థ పని చేసేంతవరకు, మంచినీళ్లు వ్యవస్థ మెరుగుపరిచే వరకు, కుళ్లిపోయిన కూరగాయలతో బయోగ్యాస్ తయారు చేసే ప్లాంట్ పునరుద్దించే వరకు, చెత్త కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చి క్లీన్ చేసేంతవరకు, ఆరోగ్యవంతమైన మార్కెట్ ని చేసేంతవరకు నా ధర్నా కొనసాగుతుంది. ఈ సమస్య మొత్తం పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడే ఉంటాను. సమస్య పరిష్కరించే వెళ్తాను. అవసరమైతే మార్కెట్ యార్డ్ ను రెండు రోజులు బందు పెట్టైన మొత్తం శుభ్రం చేయాలని కోరుతున్నాను. మహిళలు మాట్లాడే మాటలు ప్రభుత్వం వింటే సిగ్గుతో తలదించుకోవాలి. ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, లక్ష కోట్లు పెట్టి హైదరాబాదును సుందరీకరంగా చేస్తానన్న మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ మార్కెట్ యార్డ్ ను సాఫ్ చేసే కాంట్రాక్టర్లకు, టాయిలెట్స్ కడిగే కాంట్రాక్టర్లకు, చెత్తను తీసే కాంట్రాక్టర్లకు నెలకు ఏడు లక్షల ఇవ్వలేక తొమ్మిది నెలలు అవుతుంది ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఏమీ లేదు. కాంట్రాక్టర్ వెళితే 10 శాతం ఇస్తేనే సంతకం పెడతా అని చెబుతున్నారంటే నీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. మీ సంపాదన...ఆ సంపాదనతో ఢిల్లీకి పంపించే ఆలోచన, అధికారం మీద ఉన్న ధ్యాస, బోయిన్పల్లి మార్కెట్ పైన లేదు అంటే సిగ్గుతో తలదించుకోవాలి. మీకు ఒక కళంకం ఇది. ఇంత ఆర్తనాదాలు, శాపనార్థాలతో, తిట్లతో, దుర్మార్గలతో మంత్రిగా కొనసాగడం కంటే రాజీనామా చేసి మాకు చేతకాదు అని చెప్పుకోవడం మంచిది. నేనిక్కడ ధర్నా చేస్తున్న. మీ కమిషనర్ను పంపిస్తావా, సెక్రెటరీ పంపిస్తావా...వెంటనే పంపించాలి. ఈ సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే వేలాది మంది కార్మికులతో ఈ ధర్నా కొనసాగుతాదని హెచ్చరిస్తున్నాను.