మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యంశాలు మన తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ సరఫరాలపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలను కలిగించాయి. అయితే, వాస్తవానికి ఈ పరిస్థితులు మన రాష్ట్రానికి లేదా మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాము. అందువల్ల ప్రపంచ పరిస్థితుల ప్రభావం మన దేశంపైన కూడా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటోంది. దేశంలో అంతర్గతంగా జరుగుతున్న ప్రాసెసింగ్ (refining) సామర్థ్యాన్ని పెంచుతూ, అవసరమైన ఇంధనాన్ని దేశంలోనే అందించే దిశగా కృషి జరుగుతోంది. అంతేకాకుండా విదేశాల నుండి రావాల్సిన పెట్రోలియం ఉత్పత్తులను కూడా విజయవంతంగా దిగుమతి చేసుకునే విధంగా ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఎదురవుతున్న ఈ సమయంలో, భారత ప్రభుత్వం ప్రతి రోజు అనేక దేశాల నాయకులతో చర్చలు జరుపుతోంది. దేశానికి అవసరమైన ఇంధనం కొరత లేకుండా ఉండేందుకు, ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే, పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో కట్టుబడి ఉంది. ఎందుకంటే దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇక మన దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రజల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో కట్టెలు, కిరోసిన్ వంటి ఇంధనాలను ఉపయోగించిన ప్రజలు, ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎల్పీజీ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. “ఉజ్వల పథకం” ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, చిన్న రైతులు కూడా గ్యాస్ సిలిండర్లను పొందగలిగారు. సబ్సిడీ ద్వారా వారికి మరింత సౌలభ్యం కల్పించబడింది. ఈ పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా విషయానికి వస్తే, ఇది సమాచారం పంచుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో తప్పుడు ప్రచారం ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. పెట్రోల్ కొరత ఉందనే వదంతులు అనవసరమైన రద్దీకి దారి తీసాయి. అయితే, ఆయిల్ కంపెనీల అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత ఏమీ లేదు. దేశవ్యాప్తంగా సరఫరాలు సక్రమంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం అందరం శాంతంగా ఉండి, వదంతులను నమ్మకుండా, బాధ్యతతో వ్యవహరించాలి. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొంటేనే మనం విజయాన్ని సాధించగలం.
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 13 రూపాయల నుంచి 3 కి, డీజిల్ పై 10 నుంచి సున్నాకు తగ్గించింది. దీంతో వినియోగదారులకు పెద్ద ఉపశమనం చేకూరింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం నెలకొన్న సమయంలో పెట్రోల్ ఇంధన కొరత తీవ్రంగా వుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి.ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. గత నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు వరకూ వెళ్లిందని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో 30 నుంచి 50 శాతం, ఉత్తర అమెరికాలో 30 శాతం, ఐరోపాలో 20 శాతం, ఆఫ్రికా దేశాల్లో 50 శాతం మేరక ఇంధన ధరలు పెరిగాయని, కానీ మన దేశంలో పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ, వీటిని పెంచలేదన్నారు. అలాగే చమురు కంపెనీల అధిక నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వ పన్ను ఆదాయాన్ని తగ్గించుకున్నామని, అదే సమయంలో విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపై ఎగుమతి పన్ను విధించామన్నారు. లాక్ డౌన్ విధింపు వార్తలన్నీ అవాస్తవమే : కేంద్రం క్లారిటీ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మన దేశంలో ఏర్పడిన పరిస్థితులు ,ఇంధన కొరత నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. లాక్ డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలన్నీ అవాస్తవమేనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తేల్చి చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, ఎనర్జీ, సరఫరా గొలుసు, అత్యవసర సరుకు రవాణా వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. లాక్ డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని, అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదన్నారు. ఇలాంటి వదంతులు సమాజానికి హాని చేస్తాయని, గందరగోళం సృష్టిస్తాయని అన్నారు. ఈ సమయంలో అందరూ బాధ్యతతతో మెలగాలని పిలుపునిచ్చారు.
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఓ అద్భుతం జరిగింది. మూడు దశాబ్దాలకు పైగా మూసేసిన శ్రీరాముడి ఆలయం తిరిగి తెరుచుకుంది. ఈ ఆలయం హబ్బాకడల్ ప్రాంతంలో వుంది. దీంతో కశ్మీర్ లోయ చరిత్రలో ఈ ఆలయం తిరిగి తెరుచుకోవడం ఓ మైలు రాయిగా నిలిచిపోతుంది. 1857 లో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ప్రాంతంలోనే అత్యంత పురాతనమైంది. 1990 ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా, కశ్మీరీ హిందువుల సామూహిక వలసల కారణంగా అనేక ఆలయాలు మూతపడ్డాయి. అందులో ఈ ఆలయం కూడా వుంది. ఆలయం పున: ప్రారంభం అవడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంప్రదాయంగా చేసే కార్యక్రమాలన్నీ చేశారు., ఒక భారీ మహా యజ్ఞం కూడా చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ ఆలయం తిరిగి తెరవడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 36 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభం కావడంతో భక్తులు ఆనందపరవశులయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాశ్మీరీ హిందూ సమాజ సభ్యులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాణించి వచ్చారు. ఈ ఆలయం తిరిగి తెరుచుకోవడం ద్వారా కశ్మీర్ సాంస్కృతిక వారసత్వం తిరిగి ప్రారంభమైందని స్థానికులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో విగ్రహాలను కూడా ప్రతిష్ఠాపన చేయనున్నారు. కేంద్రంలోని జాతీయవాద ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసేసింది. దీంతో జమ్మూ కశ్మీర్ లో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. పర్యాటకం, సినిమా రంగం బాగా వృద్ది చెందుతోంది .
నేడు ఛత్రపతి శివాజీ జయంతి * జర్నలిస్టులకు జాతీయ సేవా పురస్కారాల ప్రదానం హైదరాబాద్: భాగ్యనగర్ శివాజీ సేవాసమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శివాజీ జయంతి సందర్భంగా గురువారం జర్నలిస్టులకు జాతీయ సేవా పురస్కారాల ప్రదానం చేయనున్నారు.కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహా పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గత 28 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారికి ఏటా పురస్కారాలు ఇస్తున్నట్లు భాగ్యనగర్ శివాజీ సేవాసమితి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నందనం దివాకర్ తెలిపారు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది పాత్రికేయులను సన్మానిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు సేంద్రియ రైతులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వాతంత్య్ర సమరయోధులు, కవులు-రచయితలు, పర్యావరణవేత్తలు, కార్గిల్‌యోధులు, అయోధ్య కరసేవకులు...ఇలా అనేక రంగాల వారికి జాతీయ సేవా పురస్కారాలు ప్రదానం చేసినట్లు వివరించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండలం రంగారెడ్డి నగర్. శివాజీ చౌక్ వద్ద గురువారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నందనం దివాకర్ కోరారు.
రాయికల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో జరిగిన మండల స్థాయి సీఎం కప్పు పోటీలలో గ్రీన్ వుడ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు దీనిలో గర్ల్స్ విభాగంలో మండల స్థాయిలో వాలీ వాలీబాల్ విభాగంలోమొదటి స్థానం లో మరియు ఖో ఖో విభాగంలో రెండో స్థానంలో నిలిచారు.దీనిలో ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ శైలేంద్రనీ రెడ్డి మరియు రాయికల్ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ రావు,ఎంపీడీవో బి.చిరంజీవి, మండల విద్యాధికారి రాఘవులు పిడి కృష్ణ ప్రసాద్ మరియు వివిధ పాఠశాలల పీడీలు విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ శైలేంద్రిని రెడ్డి విద్యార్థులను అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
రాయికల్ మండలం చెర్ల కొండాపూర్ అనుబంధ గ్రామం "పల్లె" గ్రామస్థులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని పార్టీ కార్యాలయంలో కలిసి తమ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా గ్రామ మాజీ సర్పంచ్ అర్మురి లక్ష్మి నారాయణ,పెద్ద మనిషి దువ్వక నర్సయ్యలు మాట్లాడుతూ చెర్ల కొండాపూర్ గ్రామానికి అనుబంధంగా ఉన్న పల్లెకు గ్రామ పంచాయతీ కి 1 కి.మీ పైగా దూరం ఉన్నదని,దాదాపు 500 మందికి పైగా జనాభా ఉన్న "పల్లె"గ్రామ వాసులు పెన్షన్ దారులు,రేషన్ కోసం, ఇతరత్ర గ్రామ సమస్యల పరిష్కారం కోసం చెర్ల కొండాపూర్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని,పల్లె ను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ను కోరినట్లు వారు తెలిపారు.అనంతరం గ్రామ నాయకులు,మహిళలు ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ సంఘం ఉప అధ్యక్షులు నారాయణ,క్యాషియర్ పల్లికొండ శివ,మాజీ అధ్యక్షులు నర్సయ్య, రాజేష్,రమేష్,రాజు,రాజయ్య, లింగమూర్తి,చిన్న రాజాం,మహిళా సంగమ్ అధ్యక్షులు నాగలక్ష్మి,రాజేశ్వరి, లావణ్య,మమత,సువర్ణ,రూప, సుజాత,లలిత, పల్లె ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ జేఏసీ కార్యాలయంలో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షులుగా చింతకుంట సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా సింగిడి శంకర్, కోశాధికారిగా కడకుంట్ల జగదీశ్వర్, ఉపాధ్యక్షులుగా యాచమనేని కిరణ్ బాబు, సింగని శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శిగా తిరుమల శంకర్, కార్యవర్గ సభ్యులుగా గంగాధరి సురేష్, కళ్ళెం శ్రీనివాస్, ఎద్దండి జితేందర్ రెడ్డి, తీగుళ్ళ గోపాల్ రెడ్డి, కనికరపు లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు సయ్యద్ రసూల్, ఎన్నికల పర్యవేక్షకులుగా గుర్రాల వేణు, పటేల్ నరేందర్, నాగమల్ల శ్రీకర్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణం లోని ఆర్. ఆర్ గార్డెన్స్ లో డ్రగ్స్ ,యాంటీ డ్రగ్స్ మరియు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల పై ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ,అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన రాయికల్ పోలీసులు మరియు రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసి సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై, భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దని, మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై హానికర ప్రభావాలతోపాటు ఆర్థిక నష్టాలు, సమాజంలో గుర్తింపు గౌరవం ఉండదని సూచించారు. నిషేధిత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. క్షణ కాలం సంతోషం కోసం విద్యార్థులు నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. డ్రగ్స్ నేరుగా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు. వాటిని వాడే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దుష్ప్రభావాలు చూపుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అడిషనల్ ఎస్పీ కుమారి శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ రఘు చందర్,సీఐ ,రాయికల్ యస్. ఐ సుధీర్ రావు, రాయికల్ ఎమ్మార్వో నాగార్జున, ఎంఈఓ రాఘవులు, ఎంపీ ఓ ,రాయికల్ మండలం ప్రెస్ జే ఏ సి అధ్యక్షులు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారి మచ్చశేఖర్, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి రఘుపతి రెడ్డి, చింతకుంట సాయికుమార్, సంయుక్త కార్యదర్శి గంగాధర్ సురేష్,కమిటీ సభ్యులు నాగమల్ల శ్రీకర్ గుర్రాల వేణు, సింగిడి శంకరయ్య, కల్చరల్ కార్యదర్శి ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి కార్యవర్గ సభ్యులు సింగని శ్యాంసుందర్, వాసం లింబద్రి, అన్నపురం లింబాద్రిగౌడ్, ఇమ్మడి విజయ్, కళ్లెం శ్రీనివాస్, తీగుళ్ల గోపి, సయ్యద్ రసూల్,పాత్రికేయులు విద్యార్థిని,విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో వీర కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కూంఫు కరాటే ఛాంపియన్ షీప్- 2025 లో కూంఫు డో,మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కనుక ప్రభాకర్, కనుక ప్రవీణ్ కుమార్ మరియు హరికృష్ణ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన రాయికల్ కు చెందిన 18 మంది కూంఫు డో విద్యార్థులకు 16 బంగారు పతకాలు, రెండు వెండి పథకాలు సాధించారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ కనుక ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కూంఫు డో , మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడం వల్ల శారీరకంగా,మానసికంగా ధృడత్వం పెరిగి స్వీయ రక్షణలో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు.
విజ్డం హై స్కూల్ రాయికల్ కి చెందిన విద్యార్థులు ఎడ్యుకేషన్ టూర్ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కోర్టును సందర్శించారు. గంటన్నరసేపు కోర్టులో జరిగే కేసుల విచారణ, న్యాయవాదుల వాదోపవాదాలు, జడ్జి తీర్పునిచ్చే విధానాన్ని విద్యార్థులు గమనించారు. కోర్టు ఆవరణలోని రికార్డ్ రూమ్, సెక్షన్ రూమ్ లలో కేసులకు సంబంధించిన ఫైల్స్ ను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయాలను సందర్శించి వివిధ రకాల సేవలు సమస్యల పరిష్కారాల గురించి సంబంధిత అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పుస్తకాలలో చదువు మాత్రమే కాకుండా,ఇలాంటి ఎడ్యుకేషన్ టూర్ ల ద్వారా విజ్ఞానం తో పాటు మంచి, చెడు ల మధ్య తేడాలు,నేరాల మీద వాటికీ విధించే శిక్ష ల మీద అవగాహన, సమాజం లో విద్యార్థులకు ప్రశ్నించే తత్వం, ఉన్నత అధికారులతో ప్రవర్తించే తీరు, వారితో పని తీసుకోవడంలో అవగాహన తో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకుని, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమం లో , ఉపాధ్యాయులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.