రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్‌లో ఈరోజు సాయంత్రం మున్సిపల్ సిబ్బంది చేత విస్తృతంగా ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించేందుకు ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి చర్యలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, ఎక్కడా నిల్వ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments 0