గతంలో ఒకసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు సెలూన్ ( క్షౌర శాలలు ) ల వ్యాపారానికి సమాయాత్త మవుతే ఈ దేశంలోని కొందరు మేతావులు ఒక కులం కడుపును కొట్టే ముఠాలకు వత్తాసు పలుకుతారా అంటూ తెగ గింజుకున్నట్టున్నారు. కానీ అదే పనిని మరొక వర్గం ( మతం ప్రజలు ) చేస్తుంటే మాత్రం కోర్టు మెట్లెక్కి మరీ తీర్పులిస్తున్నారు . ఆ వర్గాన్ని కాపు కాయడానికి పరుగులు పెట్టి మరీ మీ కాలికి ముళ్ళు గుచ్చుతే మా పంటితో తీస్తాం అంటూ జబ్బలు చరుస్తున్నారు. ఇక ఇంతటి మహత్కార్యాలు ఏ పాకిస్థాన్ లోనో కనీసం కాశ్మీర్ లో నో అనుకుంటే అది అతి పెద్ద పొరపాటు. ఇటీవల మన తెలంగాణా లోని వికారాబాద్ పట్టణంలో ఫిరోజ్ ఖాన్ అనే ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి క్షౌరశాల ( మంగలి షాపు ) తెరిచాడు. దాంతో ఆగ్రహించిన రమేష్ అనే క్షరకుడు ( హిందూ మంగలి కులం ) సదరు సెలూన్ పై తనతోటి కులస్తులతో కలిసి అడ్డుకున్నాడు. ఎందుకంటే హిందువుల్లోని కులవృత్తులలో ఒకరకమైన పకడ్బందీ వ్యవస్థ కట్టుబాటు ఉంటుంది. ఆయా వృత్తులలో పని చేసే వ్యక్తులు లేదా కుటుంబాలు గ్రామంలో ని ఇతర కులస్తుల కుటుంబాలను పంచుకొని ఏ కులం వృత్తి కుటుంబానికి ఏకులం కుటుంబం వచ్చిందో వారు మాత్రమే ఆరకమైన సేవలు అందిస్తారు . ఇది ఒక రకంగా చూస్తే ఒక కులం ఇంకో కులానికి బానిస లాగా కనిపించినప్పటికీ అంతర్లీనంగా సమాజ ఆర్థిక సమానత్వ సూత్రం ఇందులో దాగి ఉందనే నగ్నసత్యం ఒప్పుకోక తప్పదు. అయితే ఇందులో కొంతమంది ఎర్ర కండ్లు, పచ్చ కామెర్ల కండ్లకు వేరే విధంగా కనపడినా అది వారి దౌర్భాగ్యం అనుకోవాల్సిందే తప్ప వారి దురద అంటించుకోవడమంత అవివేకం మరేది ఉండదు అది వేరే విషయం. అయితే ఇక ఇక్కడ వికారాబాద్ లో ఈ సంఘటన జరగ్గానే సదరు నకిలీ క్షరకుడైన ( నకిలీ మంగలి ) ఫిరోజ్ ఖాన్ కు మనం ఇందాక చెప్పుకున్న కొన్ని వర్గాలు పుష్కలంగా అండా దండా అందించాయి . కోర్టుల్లో హిరోజ్ ఖాన్ తరపున కేసులు వేసేసి మరీ ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని అరిచి గోలచేసి కన్నీరు కార్చేసి ముస్లిం వ్యక్తి యోక్క క్షురకశాల ( మంగలి షాపుకు ) కు పోలీసులు బేషరతు భద్రత కల్పించాలని ఆదేశాలు ఇప్పించాయి. అంతే కాకుండా అతని క్షురకశాల ( మంగలి షాపు ) నడిచే విధంగా ప్రభుత్వమే దగ్గరుండి చూసుకోవాలని మరీ తీర్పులిచ్చాయి . అయితే ఇక్కడ ఆలోచించాల్సింది వికారాబాద్ క్షురకశాల ( మంగలి షాపు ) సమస్య ఒక్కటే కాదు. అలా అనుకుంటే మన భాగ్యనగరంలో లెక్కలేనన్ని అన్య మతస్థులు నడుపుతున్న క్షురకశాలలు ఉన్నాయి. సెక్యులర్ ముసుగులో ఉన్న వీరు ఎందుకు అన్య మతస్థులు క్షురకశాలలు,దోబీ,,మగ్గం, కుమ్మరి,కమ్మరి వృత్తులు చేయకూడదు అంటూ వాటికి విపరీత అర్ధాలు తీస్తూ అదేదో మేదో పరమైన తీర్పులంటూ తొడలు కొట్టుకుంటున్నారు. కానీ ఎంత తమ తొడలు కొట్టుకుంటూ ఉన్నా అదే తొడలమీద అదే అన్య మతస్థుల కత్తి వేటు పడదనే గ్యారంటీ ఉందా అంటే వీరి దగ్గర సమాధానం ఉండదు. వాస్తవానికి హిందూ సమాజం లో కులం వృత్తి వేరు, వ్యాపారం వేరు ,ఈ రెండు కూడా వేరు వేరు పార్శ్వాలు అన్న సంగతి మరిచి పోతున్నారు. వ్యాపారం లో కేవలం డబ్బుల గబ్బు సమస్య తప్ప మరేది ఉండదు. కాని కులం వృత్తులు అలా కాదు ఒక వడ్రంగి తన పాలుకు వచ్చిన రైతుకు నాగలి చేసివ్వడం నుండి మొదలు హిందూ సంస్కృతి సంప్రదాయాలలో వివాహం వరకు చివరికి పాడే కట్టే వరకు కూడా కుల వృత్తుల ప్రమేయం తప్పనిసరిగా ఉంటుంది. కాపు ఇంట్లో బిడ్డ సమర్తాడినా , షాలీడు ఇంట్లో పురుడు పోసినా, షావుకారు ఇంట్లో పెళ్లి జరిగినా ఒకో సందర్భానికి ఒక్కో కులం, ఒక్కొక్కసారి అన్ని కులాలు( ఉదా : పెళ్లి ) ఆ సందర్భంలోని హక్కు నా కులానిదే అంటూ ఇనాం తీసుకుంటుంది. ఉల్లంఘిస్తే పేచీ పెడుతుంది పంచాయతీ చేస్తుంది.అక్కడ చనిపోయింది గ్రామం దొర అయినా పొలిమేర చండాలుడైనా తాము పాడె కడితె తప్ప శవం లేవదు అంటుంది ఒక కులం. తను మైలపోలు తీయనిదే పెళ్లి మొదలవదు అంటుంది ఇంకో కులం . ఇక్కడ ఇదంతా మనకు పైకి కనిపించని కులం మాటున దాగిన హిందూ జీవన సౌభాగ్యం. అయితే ఈ రకమైన సంస్కృతి ని విమర్శించే వాళ్ళు లేకపోలేదు. కానీ అంతర్లీనంగా గమనిస్తే వారి భాగస్వామ్యం వెనుక పెనవేసుకున్న బందం అత్యద్భుతంగా కనిపిస్తుంది. అదే హిందూ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం. ఇక ఇప్పుటికే అనేక వ్యాపారాలలో కేవలం పులమ్ముకోవడమో పండ్లు అమ్మడానికో పరిమితమైన వ్యవస్థ మన దేశంలో వేళ్ళూనుకు పోతున్న ఇస్లామిక్ దండయాత్ర కులాల వ్యవస్త లో హిందూ జీవన విధానాన్ని కూడా విచ్చిన్నం చేయడానికే సంకల్పించినట్లుగా కనపడుతోంది. బ్రతకడానికి ఎన్నో రకాల మార్గాలుండగా మరో వర్గంలోని ఒక కులవ్యవస్థ ను దాని విడదీయరాని బందాలను తెంచడానికి ఒక హిందూ సామాజిక సమూహం వ్యతిరేకిస్తున్నా కూడా వెనక్కి తగ్గకుండా చట్టాలలోని లోపాలను రాజ్యాంగం ఇచ్చిన అతి స్వేచ్ఛ ను ఇష్టానుసారంగా ఇలా వాడుకుంటూ హిందూ సమాజానికి నష్టం చేస్తున్నారు. అంతే కాకుండా సెలూన్ మాటున కుల వృత్తుల మాటున ఆయుద వ్యాపారం చేస్తున్నట్లుగా కూడా సంబందిత సాక్షాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎల్బీనగర్ ప్రాంతం లోని ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి స్థిరపడినట్లుగా చెప్పుకుంటున్న మహమ్మద్ జీషాన్ అలియాస్ జీఖాన్ క్షురకశాల ( మంగలి షాపు ) మాటున ఒక తుపాకీ మాఫియా నే నడుపుతున్న సంగతి బయటపడింది. తుపాకీని అంటే బొమ్మల మాదిరి 5 వేల నుండి 50 వేల మద్యలో కావాల్సిన వారికి చట్ట వ్యతిరేకంగా అంధ చేస్తున్నట్లుగా పోలీసు విచారణలో బయటపడింది. అయితే ఈ ముఠా వెనుక ఉన్న శక్తులెవరు భక్తులెవరు అనే కోణంలో పోలీసులు నిఘా వ్యవస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ఇది ఒక రకంగా అంతర్గతంగా చాపకింద నీరులా ఈ వర్గం కదులుతున్న తీరును సూక్ష్మంగా గమనిస్తే ఒక మతం ఈ దేశంలోని లక్షలాది సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ మతంపై ప్రణాళికాబద్ధంగా చేస్తున్న సామాజిక దాడి మాత్రమే. ఇందులో ఎంత మాత్రం బ్రతుకు తెరువు అనే మాట లేషమాత్రమైనా లేదనే సంగతి మన కంటికి కనిపించక మానదు. న్యాలకొండ అనిల్ రావు సామాజిక విశ్లేషకులు 9542226669