దేశం పడి తేరగా తినడమే గాక అనేక నేరాలకు పాల్గొంటున్న విదేశీయులను భాహిష్కరించడానికి కేంద్రం రెడీ అవుతోంది . ఈ మేరకు రూపొందించిన నూతన విదేశీ వలస చట్టాలను వారిపై ప్రయోగించడానికి సిద్ధం అవుతోంది . ఇందుకుగాను నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధమున్న దాదాపు 16 వేల మంది విదేశీయులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వీరందరూ నిర్బంధంలోనే వున్నారు. వీరందర్నీ దేశం నుంచి బహిష్కరించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. అయితే ఈ 16 వేల మంది జాబితాను ఇప్పటికే హోంశాఖ సంబంధిత సంస్థలకు కూడా అందించింది. మరో వైపు మన దేశంలో అక్రమంగా నివాసం వుంటున్న విదేశీయులకు కఠిన శిక్షలు విధించే కొత్త చట్టం సెప్టెంబర్ 2 న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం తప్పుడు పత్రాలతో దేశంలోకి వచ్చిన విదేశీయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష వుంటుంది. అలాగే లక్ష నుంచి పది లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు. ఇలాంటి అక్రమ పాత్రలతో దేశం లోకి జొరబడిన వారి సంఖ్య దాదాపు 6 కోట్ల వరకు ఉందని ఒక అంచనాగా ఉంది.