రామగుండం ఎఫ్‌ సి ఐ గేట్‌ లక్ష్మీపురం 14వ డివిజన్‌ వాసి శ్యామల సతీష్‌ కుమార్‌ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌–1లో ఎంపికయ్యారు. సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి శంకరయ్య, అనసూయ దంపతుల రెండో కుమారుడు అయిన సతీష్‌ అనేక కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పట్టుదలతో చదివి ఈ ఫలితాన్ని సాధించారు. ఆయన ఐఏఎస్‌, ఐపీఎస్‌ లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.