|
modi add 1

తాట్లవాయి గ్రామములో యువకుని దారుణ హత్య

రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన నాగెల్లి సురేష్(24) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తల పై బలమైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసి, వ్యవసాయ బావిలో పడవేశారు. మృతుని తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తూ సంఘటనా స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ గారు, రూరల్ సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందం తో నేర స్థలం పరిశీలించారు మృతుని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

By NYALAKONDA ANIL DESAI | March 08, 2024 | 0 Comments