అంగన్వాడీ లో ఘనంగా పోషణ పక్వాడ కార్యక్రమం ఓదెల //జనం గొంతు// సతీష్ కుమార్ ఈరోజు ఓదెల మండలంలోని తారక రామా కాలనీ, అంగన్వాడి ఐదో కేంద్రం నందు పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఓదెల అంగన్వాడి సెంటర్ పరిధిలోని 19 అంగన్వాడీ కేంద్రాల యొక్క టీచర్లు మరియు సూపర్వైజర్ శ్రీమతి ఉమాదేవి గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్వైజర్ ఉమాదేవి గారు గర్భిణి స్త్రీలు మరియు బాలింత తల్లులకు పోషక ఆహార విలువలను, అలాగే పూర్వ ప్రాథమిక పాఠశాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. అదే విధంగా మహిళా సాధికారిత కేంద్రం కో- ఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ మహిళా సాధికారత యొక్క ముఖ్య ఉద్దేశాలను అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఈ రోజుల్లో మహిళలు అనేక రంగాల్లో ముందున్నప్పటికీ గాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని అధిగమించి ముందుకు వెళ్లే దిశగా ఉండాలని అన్నారు. బాల్యవివాహాలను అరికట్టాలని, సఖి మరియు అంగన్వాడి కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించడం జరిగింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ 181,1098, 155209, 14567, 112, 14416, 1930 మొదలగు నంబర్లను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ షహబ్ ఖాన్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్య పోషక విలువలు, గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగు చర్యల గురించి సూచించారు. అన్న ప్రసానం, గర్భిణి స్త్రీలకు సీమంతం, అక్షరభ్యాసం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమరి ఉమామహేశ్వరి 5 అంగన్వాడి కేంద్రం టీచర్ మరియు ఏఎన్ఎం సమ్మక్క, కృష్ణవేణి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్థానిక మహిళలు, గర్భిణీలు, బాలింత తల్లులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments 0