ఎంఎస్ గోల్వాల్కర్ గారికి 11th సెప్టెంబర్ 1948న సర్దార్ పటేల్ వ్రాసిన లేఖ “హిందూ సమాజానికి ఆర్ఎస్ఎస్ ఎంతో సేవ చేసిందనడానికి ఎటువంటి సందేహం లేదు. సహాయం, నిర్మణాత్మక సహకారం అవసరమైన అన్ని చోట్లా, ఆర్ఎస్ఎస్ యువకులు, మహిళలను పిల్లలను సంరక్షించారు, వారికి సహాయంగా ఎంతో పాటుపడ్డారు. అర్ధం చేసుకునే సామర్థ్యం ఉన్న ఏ వ్యక్తికీ దానిపట్ల ఎటువంటి అభ్యంతరం ఉండదు”, ఆయన ఇంకా ఇలా అంటారు, “ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరి వారి దేశభక్తి కార్యక్రమాలు కొనసాగించాలని నేను పూర్తిగా కోరుతున్నాను ”. Source : సర్దార్ పటేల్, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ ఎం.ఎస్. గురు గోల్వాల్కర్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలనుంచి ఉటంకించారు, ఈ సంభాషణ `జస్టిస్ ఆన్ ట్రయల్’ అనే పుస్తకంలో ఉంది. 1949 జూలై 12న RSS పై నిషేధం తొలగించబడిన తర్వాత, సర్దార్ పటేల్ ఈ సందర్భంలో శ్రీ గురుజీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు: “సంఘంపై నిషేధం తొలగించినప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో, అది కేవలం నా దగ్గర్లో ఉన్నవారికి మాత్రమే తెలుసు. మీకు నా శుభాకాంక్షలు.” (Collected Correspondence of Sardar Vallabhbhai Patel, volume 10, జూలై 1949) లో భారత ప్రభుత్వం ద్వారా ప్రచురించబడింది. 1966లో – ఇంద్రా గాంధీ, న్యాయమూర్తి జె.ఎల్. కపూర్ కమిషన్ ఏర్పాటు చేశారు. 100 మంది సాక్షులను విచారించిన తర్వాత నివేదికలో – "ఆర్‌ఎస్‌ఎస్ గాంధీ హత్య తో సంబంధం లేదు " అని స్పష్టం చేశారు ఈ క్రింది విషయం లో పటేల్ గారు స్వయంగా సర్దార్ పటేల్ తన ప్రసంగంలో, ముస్లిములతో ఏమన్నారో చెప్పే ధైర్యం RSS విమర్శిస్తున్న వాళ్లకు ఉన్నదా “ఒక విషయంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది భారతీయ ముస్లిములు, పాకిస్తాన్ ఏర్పాటుకి సహాయపడ్డారు. వారంతా రాత్రికి రాత్రే మారిపోయారని ఎలా నమ్మగలం? తాము విధేయత కలిగిన పౌరులని, కాబట్టి వారిని ఎందుకు అనుమానించాలి అని ముస్లిములు అంటున్నారు. వాళ్ళతో నేను ఇలా అంటాను ”ఆ మాట మమ్మల్ని అడగడం ఎందుకు? మీ అంతరాత్మలలో తరచి చూడండి!”. భారతదేశంలో ఉండిపోయిన ముస్లిములు, దేశం పట్ల పూర్తి విశ్వాసం, విధేయత చూపించాలని ఆయన తన భావాన్ని సూటిగా వ్యక్తపరిచారు. 13నవంబర్ 1947లో రాజకోట్ ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఎంతో స్పష్టంగా సూటిగా ఉంటుంది. ఇదొక్కటే కాదు, దేశ విభజన జరిగిన ఆ భయంకర సమయంలో, తూర్పు పశ్చిమ పాకిస్తాన్లో, హిందువులు పెద్ద ఎత్తున హృదయ విదారకమైన అత్యాచారాలకు, హింసకు హత్యలకు గురైనపుడు, ఎవరు వాళ్ళను పట్టించుకుని కాపాడారు? ఆర్ఎస్ఎస్. మాత్రమే కాపాడింది అంతేకాదు, ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ చేసిన సహకారం, త్యాగాల గురించి ఎంతోమంది గొప్పవాళ్ళు మాట్లాడారు. భారతరత్న డా. భగవాన్ దాస్, 1 అక్టోబర్ 1948 తేదిన ఈ విధంగా వ్రాసారు. “సాయుధ దళాలతో దాడులు చేసి, భారత ప్రభుత్వ మంత్రులు, అధికారులను హత్యలు చేసి, ఎర్రకోట మీద పాకిస్తాన్ జెండా ఎగురవేసి, భారత్ లో లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్ కుట్ర గురించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా ముందుగానే జవహర్లాల్ నెహ్రుకి, సర్దార్ పటేల్ కి తెలియపరిచారని నాకు ఖచ్చితంగా తెలుసు. నిజాయితీగల దేశభక్తులైన ఆర్ఎస్ఎస్ యువకులు, నెహ్రు, పటేల్ లకు ముందుగానే ఆ సంగతి తెలియజేయకపోతే, ఈ రోజు దేశమంతా పాకిస్తాన్ అయి ఉండేది, లక్షలాది హిందువులు హత్య చేయబడేవారు లేక బలవంతంగా మతమార్పిడి చేయబడేవారు, భారతదేశం మరొకసారి బానిసదేశం అయి ఉండేది. ఇది దేనినీ సూచిస్తుంది? ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులను అణిచేసే బదులు, లక్షలాదిమంది ఆర్ఎస్ఎస్ దేశభక్తుల శక్తి సామర్థ్యాలు ప్రభుత్వాలు సద్వినియోగ పరుచుకుంటే దేశం బాగుపడుతుంది”

Comments 0