తెలంగాణ ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటరు జాబితాతో పాటు తుది ఓటరు జాబితాను శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ విడుదల చేసింది.ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) జె. అరుణశ్రీ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, సెక్రటరీ ఉమా మహేశ్వరరావు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, టీపీబీఓలు హిమజ, సింధూజ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.