రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ లోcవిజయవంతం.. సెప్టెంబర్ 29, ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకొని. కరీంనగర్ రెనే హాస్పిటల్ గుండె వ్యాధుల విభాగం వారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా సెప్టెంబర్ 29 2025 రోజున ఉచిత గుండె వైద్య శిబిరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో నిర్వహించడం జరిగింది. ఇట్టి శిబిరానికి ప్రజల వద్ద నుండి అనూహ్య స్పందన లభించింది. గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న సుమారు 250 మంది పెద్దలు మరియు పిల్లలు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దినకర్ తాటిమట్ల, రోబోటిక్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ సిరిపురపు రవికుమార్, చిన్న పిల్లల గుండె వైద్యులు డాక్టర్ రాజా విజేందర్ రెడ్డి లు ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంబంధిత పరీక్షలు నిర్వహించి, గుండె జబ్బులు రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి శిబిరానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి పమేలా సత్పతి, (IAS) ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించగా, ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ జి వీరారెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ నవీన లు విశిష్ట అతిధులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న రెనే హాస్పిటల్ గుండె వైద్యులను జిల్లా కలెక్టర్ గారు ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారికి, కరీంనగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ జి వీరారెడ్డి గారికి, మరియు డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ గారికి. గారికి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తు లో ప్రభుత్వం చేసే ఇలాంటి వైద్య సేవా కార్యక్రమాల్లో తప్పకుండా రెనే వైద్య సంస్థలు తమవంతు సహకారం అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రెనే హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా.రవీంద్ర చారి, నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్ బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్, మార్కెటింగ్ మేనేజర్ అభిలాష్ రెడ్డి, శాతవాహన లయన్స్ క్లబ్ నాయకులు కెప్టెన్ డా.బుర్ర మధుసూదన్ రెడ్డి, ఇనుగుర్తి రమేష్, వడకపురం జగదీశ్వరా చారి, తిరుపతి రెడ్డి, TSTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందుపట్ల రాజిరెడ్డి లతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.