రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన నాగెల్లి సురేష్(24) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తల పై బలమైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసి, వ్యవసాయ బావిలో పడవేశారు. మృతుని తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తూ సంఘటనా స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ గారు, రూరల్ సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందం తో నేర స్థలం పరిశీలించారు మృతుని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
రాయికల్ మండలం చెర్ల కొండాపూర్ అనుబంధ గ్రామం "పల్లె" గ్రామస్థులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని పార్టీ కార్యాలయంలో కలిసి తమ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా గ్రామ మాజీ సర్పంచ్ అర్మురి లక్ష్మి నారాయణ,పెద్ద మనిషి దువ్వక నర్సయ్యలు మాట్లాడుతూ చెర్ల కొండాపూర్ గ్రామానికి అనుబంధంగా ఉన్న పల్లెకు గ్రామ పంచాయతీ కి 1 కి.మీ పైగా దూరం ఉన్నదని,దాదాపు 500 మందికి పైగా జనాభా ఉన్న "పల్లె"గ్రామ వాసులు పెన్షన్ దారులు,రేషన్ కోసం, ఇతరత్ర గ్రామ సమస్యల పరిష్కారం కోసం చెర్ల కొండాపూర్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని,పల్లె ను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ను కోరినట్లు వారు తెలిపారు.అనంతరం గ్రామ నాయకులు,మహిళలు ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ సంఘం ఉప అధ్యక్షులు నారాయణ,క్యాషియర్ పల్లికొండ శివ,మాజీ అధ్యక్షులు నర్సయ్య, రాజేష్,రమేష్,రాజు,రాజయ్య, లింగమూర్తి,చిన్న రాజాం,మహిళా సంగమ్ అధ్యక్షులు నాగలక్ష్మి,రాజేశ్వరి, లావణ్య,మమత,సువర్ణ,రూప, సుజాత,లలిత, పల్లె ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టిన ""గో టు విలేజ్ – 40 డేస్"" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మండల కార్యదర్శి `పాలేపు బాలరాజు' ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ మాట్లాడుతూ, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఇచ్చిన సర్క్యులర్ మేరకు గ్రామాల్లోని ప్రతి మాదిగ విద్యార్థి తప్పనిసరిగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. సుమారు 30 సంవత్సరాలపాటు వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసి దానిని సాధించిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆశయాలను నెరవేర్చాలంటే విద్యనే ప్రధాన ఆయుధంగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే ప్రతి మాదిగ కుటుంబం తమ పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు. అదేవిధంగా జూలై 7న జరగనున్న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాయికల్ మండలంలోని ప్రతి మాదిగవాడలో ఘనంగా నిర్వహించి, ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్ మాదిగ, జిల్లా కార్యదర్శి సంగెపు ముత్తు మాదిగ, జిల్లా సంయుక్త కార్యదర్శి బదినేపల్లి సురేష్ మాదిగ, బొల్లె గంగాధర్, బొల్లె చిన్నయ్య, మస్తీన్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దర్శనం శంకర్, దర్శనం విష్ణు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.