రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పదవికి నాగండ్ల రవికుమార్, మిట్టపల్లి శంకర్, పిట్ట లక్ష్మీ నర్సయ్య, కాస సత్యనారాయణ నామినేషన్లు దాఖలు చేయగా, ప్రధాన కార్యదర్శి స్థానం కోసం రాచర్ల శ్రీనివాస్, దాసరి రఘు, కొవ్వూరి వెంకట్రాజం, వి. తిరుపతి రావు, చీదురాల రాజి రెడ్డి బరిలో నిలిచారు.అలాగే కోశాధికారి పదవికి పెరటి రవీందర్ రెడ్డి, వేముల రమేష్ పోటీ చేస్తున్నారు. కాలనీ అభివృద్ధి, మౌలిక వసతులు, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకుని సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఎన్నికల కమిటీ ఓటర్లకు పిలుపునిచ్చింది.