డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (డీజేఎఫ్) జిల్లా జాయింట్ సెక్రటరీగా డాక్టర్ నాగండ్ల రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి జర్నలిస్టుకి ₹10 లక్షల బీమా, ఉచిత బస్ పాస్, 75% రిజర్వేషన్‌తో రైల్వే పాస్, ఇంటి నిర్మాణ రుణ సబ్సిడీ, కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.