|
modi add 1

ఘనంగా గంగమ్మ తల్లి బోనాలు.. గంగపుత్ర (బెస్త) కుల ఐక్యతతో మంథని మార్మోగింది

మంథనిలో గంగపుత్ర బెస్తల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో శ్రీ గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, కొబ్బరికాయ కొట్టి వేడుకలకు శుభారంభం చేశారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని భక్తి గీతాల నడుమ ప్రధాన రహదారుల మీదుగా గోదావరి తీరానికి భారీ ర్యాలీగా తరలివెళ్లారు. డీజే సౌండ్స్‌తో పాటు డప్పు కళాకారుల మోతలు, సంప్రదాయ నృత్యాలు, గంగపుత్రుల చేపల వేట విధానాల ప్రదర్శనలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోదావరి తీరంలో గంగమ్మ తల్లి, గౌరమ్మ, మత్స్యగిరీంద్రుడు, చేప, తాబేలు ప్రతిమలకు పుష్పాలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధల నడుమ ప్రతిమలను గోదావరిలో నిమజ్జనం చేశారు. ఆ తరువాత గంగపుత్రులు సహపంక్తి భోజనాలు నిర్వహించి ఐక్యతను చాటారు. ఈ వేడుకల్లో మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, చల్లా నారాయణరెడ్డి పాల్గొని బోనాలు ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగమ్మ తల్లి బోనాల వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు మంథని ప్రాంత ప్రజలతో పాటు గంగపుత్రులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు గంధం వెంకటస్వామి, అంకరి ప్రకాశ్, అంబటి సతీష్, బోయిని నారాయణ, అంబటి శ్రీనివాస్, గట్టయ్య, సౌళ్ల స్వామి, అటికేటి నరేష్, అంకరి శివమురళీ, అటికేటి కోటేష్, అటికేటి శ్రావణ్, అటికేటి సాగర్, నర్సయ్య, జీదుల రాజేందర్, మోసం శంకర్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

By Ambati Sathish kumar | August 05, 2026 | 0 Comments

కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్

కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్ అన్నారు.మంగళవారం రాయికల్ పట్టణంలో పట్టణ,మండల యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ యువతకి అవకాశాలు కల్పిస్తుందని కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అర్హులైన వారికి చేరేలా అవగాహన కల్పించాలని అన్నారు.రాజకీయాల్లో యువత చురుకైన పాత్ర పోషించాలని ప్రతి యువకుడు ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలని సూచించారు.యువత తమ ప్రతిభ,సేవా దృక్పథం,నిబద్ధతతో ప్రజలకు చేరువై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావడంతో పాటు సామాజిక సేవలో ముందుండాలని కోరారు.దేశాభివృద్ధి,రాష్ట్ర ప్రగతిలో యువశక్తి కీలకమని పార్టీ బలోపేతానికి యువత ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ యువతకు సముచిత ప్రాధాన్యతతో పాటు నాయకత్వ అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. రానున్న ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో యువత చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ బలుస సాయి,అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ కర్నె భూమా రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ బొద్దుల శివ,రాయికల్ పట్టణ యూత్ నాయకులు అల్లె పురుషోత్తం,అనుమల్ల చింటూ,కాశిరెడ్డి సంజీవ్,మోర చైతన్య,గుండేటి రూపేష్,నరంశెట్టి మనోజ్,గట్టు బంటు,సింగని వరుణ్,శ్రీరాముల సాయి,పడిగెల నరసింహ,కొత్తపెల్లి అరవింద్, శివ,శ్రీకాంత్, సాయి,హరీష్,జలపతి,మధు,యూత్ నాయకులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 04, 2026 | 0 Comments

మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేయాలి - కూచిరాజ్‌పల్లి బెస్త కుటుంబాల డిమాండ్‌

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం కూచిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన సుమారు 40 బెస్త (మత్స్యకార) కుటుంబాలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేసి, అర్హులైన వారికి సభ్యత్వం కల్పించాలని మత్స్యకార కుటుంబాలు కోరుతున్నాయి. చేపల పెంపకమే తమ ప్రధాన జీవనాధారమని, గ్రామంలో మత్స్యకార సహకార సంఘం లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపల పెంపకానికి సంబంధించిన అవకాశాలు, ప్రభుత్వ చెరువుల నిర్వహణకు సంబంధించిన ప్రయోజనాలు అందడం లేదని వారు తెలిపారు. దీంతో తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. కూచిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబాలతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి సభ్యత్వం కల్పించాలని వారు కోరారు. అలాగే గ్రామ సమీపంలోని ప్రభుత్వ చెరువుల్లో నిబంధనల ప్రకారం చేపల పెంపకం చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మత్స్యశాఖ, సహకార శాఖ, రెవెన్యూ అధికారులతో సమగ్ర విచారణ నిర్వహించి, తమ సమస్యకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. 40 కుటుంబాల పేర్లు, సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించినట్లు తెలిపారు.

By Ambati Sathish kumar | August 03, 2026 | 0 Comments

చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు అందజేత

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై అభిమానంతో జూల నవీన్ తన తమ్ముడు దివంగత జూల ప్రవీణ్ జ్ఞాపకార్థం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 80 ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని పాఠశాల బృందం అభినందిస్తూ జూల నవీన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో మండల విద్యాధికారి కొమురయ్య, ప్రధానోపాధ్యాయుడు రాచర్ల శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | July 18, 2026 | 0 Comments

విద్యుత్ కోతలతో రైతుల ఆందోళన.. పంటలకు ముప్పు

వర్షాభావంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి జిల్లా రైతులు ఇప్పుడు విద్యుత్ కోతలతో మరింత ఆందోళన చెందుతున్నారు. నాట్ల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడంతో బోర్లు, బావుల ద్వారా సాగునీరు అందించడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. నిర్ణీత సమయాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించి పంటలను కాపాడాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

By Ambati Sathish kumar | July 16, 2026 | 0 Comments

బండారి మారుతిపై పీడీ ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బండారి మారుతిపై జారీ చేసిన పీడీ (నిరోధాత్మక నిర్బంధ) ఉత్తర్వులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జి.ఓ.ఆర్.టి. నెం.1013, తేదీ 13-07-2026 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసే వారిపై అవసరమైతే పీడీ చట్టాన్ని అమలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులు, ముఠాలు, వ్యాపారులపై చట్టపరమైన చర్యలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

By Ambati Sathish kumar | July 14, 2026 | 0 Comments

సింగరేణి అధికారుల సమస్యలపై త్వరలో నిర్ణయం: భట్టి విక్రమార్క

సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 2,200 మంది అధికారుల వేతన సవరణ, పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP) తదితర సమస్యలపై రెండు నుంచి మూడు నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. అధికారుల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించి, అధికార సంఘం నాయకులతో చర్చించి వారికి భరోసా కల్పించాలని సూచించారు. అలాగే సింగరేణి పోటీతత్వాన్ని పెంచి సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

By Ambati Sathish kumar | July 13, 2026 | 0 Comments

మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఏసీపీ రమేష్

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు. మంథని గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించి, అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

By Ambati Sathish kumar | July 11, 2026 | 0 Comments

రోడ్డు కబ్జాపై ఎమ్మెల్యే సీరియస్.. వెంటనే చర్యలకు ఆదేశాలు!

పద్మావతి కాలనీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రోడ్డు కబ్జా సమస్యను కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ చేసి స్థలాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనతో కాలనీవాసుల్లో సమస్య పరిష్కారంపై ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్‌కు, సమస్యను దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ సాగి సంతోష్ కుమార్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు డా. నాగండ్ల రవికుమార్, కమిటీ సభ్యులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

By Ambati Sathish kumar | July 11, 2026 | 0 Comments

అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం

పర్యావరణహితమైన జూట్ బ్యాగులను ప్రజలు వినియోగించాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్ అన్నారు... అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద 200 జూట్ బ్యాగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగుల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్,కోశాధికారి సుధవేణి మురళి,క్లబ్ సభ్యులు బత్తిని భూమయ్య,మ్యాకల రమేష్,మచ్చ శేఖర్,దాసరి గంగాధర్, కాటిపెల్లి రామ్ రెడ్డి,కటకం కళ్యాణ్,బొమ్మ కంటి నవీన్,ఆడెపు రాం ప్రసాద్,గోపాల్,వాసం రాజేందర్,పులి రమేష్, సత్యనారాయణ ,అశోక్ పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ రాజేశం,యువకులు అనుమండ్ల తేజ,సాయికుమార్,తదితరులు పాల్గొన్నారు

By Gantyala Praveen | July 03, 2026 | 0 Comments

Hot Categories

2
7
1