ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సర్పంచ్ పల్లె ప్రతిమ పివీరావు ఆధ్వర్యంలో 9వ, 10వ తరగతి విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి బేగంపేట హైస్కూల్‌లో ప్రవేశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు మల్కా రాంకిషన్ రావు మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు గతంలో మాదిరిగానే విమానంలో విశాఖపట్నం విహారయాత్రకు తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అలాగే విద్యార్థుల కోసం ఉచిత రాకపోకల ఆటో సౌకర్యం అందిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి విద్యార్థులకు రీడింగ్ కార్నర్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తూ విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఉపాధ్యాయులు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శైలజ, ఉపాధ్యాయులు మల్కా రాంకిషన్ రావు, పద్మజ, శ్రీనివాస్, సంపత్ కుమార్, గీతారాణి, మంగ, శ్రీదేవి, స్వరూప, పీఈటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments 0