రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం గోదావరి నది పుష్కరఘాట్ వద్ద “ఏక్ దిన్ – ఏక్ ఘంటా – ఏక్ సాత్: నేషన్‌వైడ్ వాలంటరీ శ్రమధాన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి మాట్లాడుతూ – “సమిష్టి కృషితోనే స్వచ్ఛత సాధ్యం, పరిశుభ్రతా క్రమశిక్షణను అలవర్చుకోవడంలో ఈ కార్యక్రమం మైలురాయి” అని అన్నారు.