గోదావరిఖని, మార్కండేయ మండలం: మార్కండేయ కాలనీ శివాలయం వద్ద ఈ రోజు హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు కోలాటంతో వేడుకకు ప్రత్యేక శోభనీ తెచ్చారు. కార్యక్రమ ప్రధాన వక్త భానుచందర్, RSS ప్రచారక్ మాట్లాడుతూ, “హిందూ ఐక్యతే దేశ బలానికి పునాది, భారత్ విశ్వగురు స్థానం వైపు దిశా సాగుతోంది” అని పేర్కొన్నారు. ఈ హిందూ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించిన వారిలో— హిందూ సమ్మేళనం నిర్వహణ అధ్యక్షులు కరివేదా సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి తోట ప్రవీణ్, అలాగే ఈసంపెల్లి వెంకన్న, రాములు, RSS నగర కార్యవహా పెడిపెల్లి రామ్మూర్తి, సహ కార్యవహ మంతెన శ్రీనివాస్, ఉమాపతి, అంబటి సతీష్, శివాలయ కమిటీ అధ్యక్షులు మంచికట్ల బిక్షపతి, బండారి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో హిందూ బంధువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.