రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం 4, 5, 28, 29, 30 డివిజన్లలో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలు కాలనీల్లో వీధులు శుభ్రం చేసి మురుగు కాలువల పూడిక తొలగించారు. ఆదివారం 1, 6, 7, 8, 24, 31 డివిజన్లలో డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.