సేవా సేతు క్యాంపులో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజనపై ప్రజలకు అవగాహన కల్పించారు. రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు, సబ్సిడీ, పథకం ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా గోదావరిఖని సబ్‌డివిజన్ ఏఈ గుండు శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఏఈ ఎర్రోజు రమేష్, పీజీ సెంటర్ ఏఈ సీహెచ్. వంశీకృష్ణ, సబ్ ఇంజినీర్ ఇరుగురాల రవివర్మలను వారాహి ఎనర్జీస్ ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో వారాహి ఎనర్జీస్ మేనేజర్ బూడిద సతీష్‌తో పాటు సేల్స్ మేనేజర్లు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు.

Comments 0