రామగుండం 49వ డివిజన్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు (02-04-2026) ఉదయం 10 గంటలకు శారదా నగర్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో వార్డ్ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, వృద్ధాప్య మరియు వితంతు పింఛన్‌ల కోసం దరఖాస్తులు స్వీకరించబడతాయి. అర్హులైన ప్రజలు అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ సాగి సంతోష్ కుమార్ కోరారు.

Comments 0