సుల్తానాబాద్‌లోని సాధన డిగ్రీ కళాశాల & వివేకానంద జూనియర్ కళాశాలలో నూతన విద్యార్థులకు ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. చైర్మన్ భూసారపు బాలకిషన్ ప్రసాద్, కరస్పాండెంట్ ఎర్రంశెట్టి మునీందర్, డైరెక్టర్లు ఉమారాణి, రవీందర్, ప్రిన్సిపాల్స్ సుజాత, కిరణ్, సాయికిరణ్, రజిత పాల్గొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని, సాన్వి డిఫెన్స్ అకాడమీ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తామని ఎర్రంశెట్టి మునీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.