*"ఆది పరాశక్తి", "రాక్షసి".* *పదాలు రెండూ పరస్పర విరుద్ధంగా వున్నా, గుణాన్ని లెక్కగట్టే విషయంలో భావం ఒక్కటే. బాధితులు "రాక్షసి" అంటే, హర్షించినవారు "ఆదిపరాశక్తి" అంటారు.* *ఈ రెండింటి ప్రతిరూపం భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, ఢిల్లీ ఎన్ ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టరు మరియు ఢిల్లీ మద్యం కుంభకోణం కూపీలు లాగుతున్న అద్వితీయ మహిళ.* *మనం సాధారణంగా టివి ఒ.టి.టిలో క్రైం థ్రిల్లర్ సీరియల్ చూసినా, సినిమా చూసినా ఇలాంటి లేడీ ఆఫీసర్ చేసిన నటిని "ఎంతబాగా చేసిందో" అంటూ ఉంటాం.* *అదే దృశ్యం నటన కాకుండా నిజం అయితే?*💪 *హైదరాబాదులో కవిత అరెస్టు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కచ్చితంగా అపూర్వం. భానుప్రియ ఆ రెండు విధులునూ ఎంత తెగింపుతో చేసిందో, ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేసిందో, ఎంత పరిపక్వత, అనుభవం చూపించిందో చూసినవారు చప్పట్లు కొట్టిఉంటారు.* *కల్వకుంట్ల తారక రామారావుని "ఎక్కువ మాట్లాడితే నిన్నూ జైల్లో పడేస్తా" అనడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి?* *తొమ్మిది సార్లు తప్పించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ను పదవసారి కారెక్కెంచుకుని తన ఆఫీసుకి లాక్కెళ్ళిన ధీశాలి భానుప్రియ మీనా.* *గుండె ధైర్యం మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా ఉంటుంది. కానీ, వాడే సందర్భాలు లెక్క పెట్టవచ్చు.* *వాడాలి అనుకున్నారా.... వారి పేరు భానుప్రియ మీనానే.* అందుకే ఆమె పనిని ఇష్టపడేవారు ఆది పరాశక్తి అంటే ఆమె వల్ల జైలు ఊచలు లెక్కపెడుతున్నారు రాక్సీ అంటారు.
Comments 0