ఎన్టీపీసీ కృష్ణనగర్: ప్రముఖ వ్యాపారి వేణు గోపాల్ మలాని నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, వ్యాపార ప్రముఖులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తేనేటి విందులో పాల్గొన్న ఎంపీ, వ్యాపార రంగానికి సంబంధించిన పలు అంశాలపై వారితో ముచ్చటించారు. వ్యాపారవేత్తలు స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కందుల సంధ్యారాణి, కందుల పోశం తదితరులు పాల్గొన్నారు.



Comments 0