రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 13 మంది డ్రైవర్స్ డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడ్డారు. వీళ్లలో 12 మందికి రూ.28,000 జరిమానా విధించారు. రెండోసారి మత్తులో వాహనం నడిపిన వ్యక్తి – వెంకటేష్ దుర్వ కు ఐదు రోజుల జైలు శిక్ష విధించి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో భద్రతపై గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థ, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్‌ల పనితీరును పరిశీలించారు. హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా చూడాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, కస్టమర్లకు భద్రతపై అవగాహన కల్పించాలని సీఐ సూచించారు.
రామగుండం ట్రాఫిక్ సబ్-ఇన్స్పెక్టర్ G. హరిశేఖర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురు వ్యక్తులను సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్, గోదావరిఖని శ్రీ వెంకటేష్ దుర్వ గారి ముందు హాజరుపరచారు. ఇందులో ముగ్గురికి రూ.6,000/- జరిమానా విధించగా, రెండవసారి నేరానికి పాల్పడిన ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. శిక్ష విధించబడిన వ్యక్తిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
దేశంలో ఓ పెద్ద ఇస్లామిక్ ఉగ్రవాద ఆపరేషన్ ను భగ్నం చేసింది గుజరాత్ ఏటీఎస్. గుజరాత్ గాంధీనగర్ లోని అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్ లో ఉగ్రదాడికి ప్రణాళికలు వేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తుపాకులు, విషపూరిత రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోందని ఏటీఎస్ పేర్కొంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ కుమారుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, మహ్మద్ సులేమాన్ కుమారుడు మహ్మద్ సుహైల్ మరియు సులేమాన్ సైఫీ కుమారుడు ఆజాద్ అనే ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది.అరెస్టయిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ హైదరాబాద్ నివాసి. మొహమ్మద్ సుహెల్ మొహమ్మద్ సులేమాన్ మరియు ఆజాద్ సులేమాన్ సైఫీ ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నివాసితులు. ముగ్గురి వయస్సు దాదాపు 25 సంవత్సరాలు. ముగ్గురు ఉగ్రవాదులను ఓ సంవత్సరం పాటు నిఘాలో వుంచింది ఏటీఎస్. వారి లొకేషన్ ను నిరంతరం ట్రాక్ చేసి, వారి ప్రతి కదలికను పరిశీలించారు. ఈ ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు రైజిన్ అనే అత్యంత విషపూరితమైన ద్రవాన్ని తయారు చేస్తున్నారు.
తనదాకా వస్తే గానీ తెలియదు అనేది ఓ సామెత. లవ్ జిహాద్ అసలు లేనేలేదని, ఆరెస్సెస్, హిందుత్వ వాదుల సృష్టేనంటూ చెప్పుకొచ్చిన కమ్యూనిస్టులకు తత్వం బోధపడింది. ఈ ఆపదే ఓ కమ్యూనిస్టు కూతురుకే వచ్చింది. దీంతో అది లేనే లేదు.. అదంతా సృష్టే అని మహా లౌకికత్వాన్ని ప్రదర్శిస్తూ తత్వ బోధ చేయాలి కదా.. అబ్బే అలా ఏమీ చేయలేదు.. లవ్ జిహాద్ లో తన కూతురు ఇరుక్కుందని తెలిసిన తర్వాత ఓ కమ్యూనిస్టు నేత ఏం చేశాడో తెలుసా... కాసర్ గఢ్ కి చెందిన సీపీఎం పార్టీ ఉడుమ ఏరియా కమిటీ సభ్యుడు పవీ భాస్కరన్ కే ఈ పరిస్థితి వచ్చింది. తన కూతురు సంగీత తన దగ్గరికి వచ్చి, ముస్లింని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. చెప్పడమే ఆలస్యం.. అపర కమ్యూనిస్టు నేత భాస్కరన్ హింస చేయడం ప్రారంభించారు. తన ఇంట్లోనే కుమార్తె సంగీతను బంధించి, దారుణంగా హింసిస్తున్నాడని సంగీత ఓ వీడియో ద్వారా ప్రకటించింది. దీంతో పెద్ద సంచలనమే రేగింది. అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం సంగీత నడుము కింద పక్షవాతంతో బాధపడుతోందని, చాలా బాధలతో వుందని అంటున్నారు. అయినా సరే లవ్ జిహాద్ బయటపడటంతో తాను గృహ నిర్బంధంలో వున్నానని, చికిత్స కూడా చేయించడం లేదని పేర్కొంది. అంతేకాకుండా తన ఆస్తిలోని వాటాను కూడా లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా తనను ఒప్పించారని చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత తనకు మొత్తం అందిన భరణాన్ని తన తండ్రి, సోదరుడే స్వాధీనం చేసుకున్నారని, సరైన వైద్యం కూడా అందడం లేదని తెలిపింది.వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేసిన తర్వాత హింస తీవ్రమైందని ఆమె ఆరోపిస్తోంది. తన తలపై చాలాసార్లు కొట్టారని, "వెళ్లి చనిపో" అని చెప్పారని కూడా ఆమె ఆరోపిస్తోంది. కమ్యూనిజం, ఇలాంటి వాటికి ఈ ఇంట్లో స్థానం లేదని కూడా తన తండ్రి బెదిరిస్తున్నాడని, తన మాట వినకపోతే చంపేస్తానని కూడా అంటున్నాడని చెప్పుకొచ్చింది. తన వద్ద అధికారం వుందని, తనను ఏమీ చేయలేరని కూడా చెప్పుకొచ్చాడని పేర్కొంది. kerala cpm leadercpm leader love jihad
* వేతనాలు ఇప్పించాలని లేబర్ కమిషన్ జాయింట్ కమిషనర్ సునీత దాస్ కు డబ్ల్యూజేఐ వినతి హైదరాబాద్: ముద్ర పత్రిక సిబ్బందికి యాజమాన్యం వెంటనే వేతనాలు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రాష్ట్ర శాఖ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేసింది. సోమవారం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కార్మిక కమిషనర్ సునీత గోపాల్ దాస్ ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రతినిధి బృందంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జు భయ్యా, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్ దేశాయ్ న్యాలకొండ ఉన్నారు. ముద్ర పత్రిక జర్నలిస్టులు, సిబ్బందితో కలిసి వారు సమస్యను వివరించారు. తమకు దాదాపుగా 5 నెలల నుంచి 11 నెలల వరకు జీతం బకాయి ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై త్వరలో ముద్ర యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని సంయుక్త కార్మిక కమిషనర్ సునీత గోపాల్ దాస్ హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ముద్ర పత్రిక సెంట్రల్ టెస్ట్ ఇన్చార్జి కే జహంగీర్ పాషా, న్యూస్ ఎడిటర్ రామ్ మనోహర్, చీఫ్ సబ్ ఎడిటర్ ఉమా మహేశ్వరి, సీనియర్ సబ్ ఎడిటర్లు హరనాథ్, కిరణ్, బ్యూరో సభ్యులు శ్రీనివాస్, ముజాహిద్దీన్ బాబా, శరత్, సీనియర్ డిజైనర్లు రవి అనిత, మహేశ్వరి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
అక్రమనిర్బంధాలు మందిర నిర్మాణాన్ని అడ్డుకోలేవు ; VHP అరెస్టులు, గృహ @ ముస్లిం మెప్పుకోసం హిందూ మందిరాల ధ్వంసం @ పోలీసులను ముందు పెట్టి భయ బ్రాంతులు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం @ అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్యమం ఆగదు @ రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమించి మందిరం నిర్మించి తీరుతాం @ హిందువుల మనోభావాలు గౌరవించి మందిరం నిర్మించి తీరాల్సిందే..! @ తరతరాలుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని, మందిరాన్ని ధ్వంసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి @ సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని తొక్కిపెట్టడమేనా..? @ నిజాం వారసత్వాన్ని అందుకొని హిందువులపై దాడులకు దిగితే తగిన బుద్ధి చెప్పక తప్పదు..! పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శి చింతల వెంకన్న, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ రాష్ట్ర కోకన్వీనర్ సుభాష్ చందర్ విమర్శించారు. ముస్లింల మెప్పు కోసం హిందూ మందిరాలను ధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు కొనసాగాయి. మంగళవారం రోజు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ మందిరం దగ్గర కుంకుమార్చన నిర్వహించాలని చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అటువైపు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి కార్ఖానా, బోయిన్పల్లి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యలను విశ్వహిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దమ్మ తల్లి మందిరం నిర్మించి, హిందువుల మనోభావాలు గౌరవించాల్సిందే నని పట్టుబట్టారు. మందిరం నిర్మించే వరకు పోరాటం ఆగదు అని తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ,భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం, గృహాల్లో నిర్బంధించడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలనకు తిరతిస్తున్నదని దానిని హిందూ సమాజం ఒప్పుకోదని హెచ్చరించారు. బడుగుల పండుగ అయిన బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా నిలిచే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలపై దాడి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో సహా నాయకులందరినీ అరెస్టు చేసి పెద్దమ్మ తల్లి పూజకు దూరం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతామని విశ్వహిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు. రాబోవు రోజులలో రెట్టింపు స్థాయిలో ముందుకు వెళ్లి మందిరాన్ని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. సెక్యులరిజం పేరుతో హిందూ సమాజాన్ని తొక్కి పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. పెద్దమ్మ తల్లి పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించకుండా దాదాపు 1200 మంది పోలీసులను మోహరించడం నిజాం పరిపాలనకు నిదర్శనం అన్నారు. దాదాపు 2000 మంది బజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్టు చేసేదాకా వదలమని పోలీసులు హెచ్చరించడం దుర్మార్గమని నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రధాన పీఠ వేస్తున్నారని, అదే సమయంలో హిందువుల మనోభావాలను పూర్తిగా విస్మరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరును విశ్వహిందూ పరిషత్ నేతలు తప్పు పట్టారు. తరతరాలుగా పూజలందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని అపవిత్రం చేసి, మందిరాన్ని ధ్వంసం చేసి , హిందువులపై ఘోరమైన కేసులు నమోదు చేయడం , లాఠీచార్జ్ చేయడం, మహిళలను చితకబాదడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. అమ్మవారి విగ్రహాన్ని అపవిత్రం చేసి, విగ్రహాన్ని తరలించి, మందిరాన్ని ధ్వంసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల మాదిరి హిందూ నాయకులపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, భయభ్రాంతులకు గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వారు హెచ్చరించారు. నిర్బంధాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అన్నింటిని ఎదుర్కొని.. పెద్దమ్మతల్లి పవిత్రతను కాపాడి భవ్యమైన మందిర నిర్మాణం నిర్మాణం సాధించి తీరుతామని స్పష్టం చేశారు. అరెస్టులు, అక్రమ కేసులు తమకు కొత్త కాదని.. లక్ష్యం చేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని విశ్వహిందూ పరిషత్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భవదీయ పగుడాకుల బాలస్వామి ప్రచార ప్రముఖ్ విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం 99129 75753 9182674010
గోదావరిఖని ఎల్బీ నగర్‌కి చెందిన కారు డ్రైవర్ మారుపెల్లి ప్రణయ్ భాస్కర్ (29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరాయికి తీసుకున్న, స్నేహితుల వద్ద నుండి తెచ్చుకున్న నాలుగు కార్లను ఇతరుల వద్ద తనఖా పెట్టి సుమారు రూ.10 లక్షలు తీసుకొని మోసపూరితంగా వినియోగించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, 4 కార్లు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఏసీపీ ఎం.రమేష్ మాట్లాడుతూ వాహనాలు తనఖా పెట్టే ముందు యజమాని వివరాలు, పత్రాలు ఖచ్చితంగా పరిశీలించాలంటూ ప్రజలకు సూచించారు.
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన సుమారు 130 ట్రాక్టర్ల ఇసుక డంపులను పోలీసులు గుర్తించారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలో ఇసుకను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, “ఇసుకను స్వలాభం కోసం అక్రమంగా నిల్వ చేస్తే ఉపేక్షించము. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవు” అంటూ హెచ్చరించారు.
రామగుండంలో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 10న పెట్రోలింగ్ సమయంలో పట్టుబడిన నిందితుల వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, బైకులు, ఫోన్లు, డీజే సిస్టం, నగదు స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖని, రామగుండం ప్రాంతాల్లో చేసిన 9 దొంగతనాల కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.