ఎల్కలపల్లిలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, వర్షాకాలంలో దోమల నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్ప్రే, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వంటి చర్యలతోపాటు, ప్రజలు దోమతెరలు, జాలీలు వాడాలన్నారు. వాటర్ ట్యాంక్ పరిశీలన, ట్రేడ్ లైసెన్స్ అవగాహన, పీఎం స్వనిధి వివరాలు తెలిపారు. పీకే రామయ్య కాలనీలో మొక్కలు నాటారు.