సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయు టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పొన్నం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. రాయికల్ మండలం ఇటిక్యాల, బోర్నపల్లి, చింతలూరు, వడ్డే లింగాపూర్లలో ఉపాధ్యాయులను కలిసి బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు అమలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలన్నారు. సీపీస్ ఉపాధ్యాయుల డిఎ బాకాయలు ప్రతి నెల చెలించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంతడుపుల గంగారాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి లక్కడి రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి దొంతి సతీష్ లు పాల్గొన్నారు.
Comments 0