-: బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇరాన్ (పశ్చిమాసియాలో) యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా నిర్ధిష్ట చర్యలు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ఇరాన్ యుద్ధం నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలుపెరుగుతాయేమో, ఇంధన కొరత ఉంటుందేమో అని నిన్నటి వరకు ప్రజలు ఆందోళన చెందారు. అయితే ఎల్లప్పుడూ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదని, పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తకుండా చూడడమే కాకుండా, వాటి ధరలు కూడా పెరగకుండా నిర్ధిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రం పెట్రోల్ పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించారు. అలాగే, డీజిల్ పై లీటరుకు రూ.10గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. దీంతో, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలుపెరుగుతాయేమో అని ఆందోళనకు గురైన సమాన్య వినియోగదారులందరికీ భారీ ఊరట కలిగింది. ఒక్క పైసా కూడా ధరలు పెరగకుండా పన్నులు తగ్గించిన ప్రధాని నరేంద్ర మోదీ గారు, అసలు ఎలాంటి కొరత కూడా లేకుండా గల్ఫ్ ప్రాంతం నుంచి మన దేశానికి చమురు సరఫరా సాఫీగా జరిగేలా మన విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి ఇతర దేశాలకు చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సమర్ధ నాయకత్వం, దూరదృష్టి, ఇరాన్ వంటి దేశాలతో ఉన్న సత్పంబంధాలు పెట్టుకునేటి వంటి విదేశాంగ విధానాన్ని అమలు చేయడం ద్వారా మన దేశంలో ఇంధన సంక్షోభం రాకుండా చేయగలిగారు. అయినప్పటికీ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మన దేశంలోని ఆయిల్ కంపెనీలకు గల్ఫ్ నుంచి చమురును దిగుమతి చేసుకునే వ్యయం పెరిగింది. దాంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజల్ ధరలను పెంచుతాయేమో అనే కలవరం ప్రజలను వెంటాడింది. అయితే ఎల్లప్పుడూ ప్రజల బాగోగులకే ప్రధాన్యత ఇచ్చే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తక్షణమే స్పందించి, పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడమే కాకుండా డీజిల్ పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సామాన్యుల ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువు చేసారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఉపశమనం కలిగించిన. అసలు ఇంధన కొరతే రాకుండా సామాన్యులకు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండేలా నిర్ధిష్ట చర్యలు తీసుకున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మనమంతా ధన్యవాదాలు తెలపుకోవాలి.

Comments 0