రామగుండం, అక్టోబర్ 1: రామగుండం నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్గా 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము నియమితులయ్యారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నెలకంటి రాముకు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని రాము తెలిపారు.

Comments 0