పెద్దపల్లి, అక్టోబర్ 1: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ ఆదేశాల మేరకు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి సమక్షంలో గురువారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శులుగా కుక్క వంశీ (పెద్దపల్లి), దబ్బెట కమలాకర్ (ఎన్టీపీసీ రామగుండం), మల్లారపు అరుణ్ కుమార్ (కమాన్‌పూర్) నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా బుషిపాక సంతోష్, దాసరి శ్రావణ్, చిలుక తిరుపతి, దుర్గం తిరుపతి, అన్నారపు సాయి మౌనిక, కనుకుంట్ల జోగేందర్లను నియమించారు. కార్యదర్శులుగా జనగామ శివ రామకృష్ణ, జంజర్ల శ్రీనివాస్, బూడిద తిరుపతి, జంగం పోషయ్య, పాసులు శివ, కల్లెపల్లి అంజి, బుంగ మహేష్, మొలుగూరి రవీందర్, డోలె అర్జయ్య, సకినాల కృష్ణలను ఎంపిక చేశారు. కోశాధికారిగా గంధం శంకర్, మీడియా ఇన్చార్జిగా గోషిక రమేష్, ఐటీ, సోషల్ మీడియా ఇన్చార్జిగా చిలుముల రజితలను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా గట్ట అంకయ్య, దాసరి రమ్య, కుమ్మరి మల్లేష్, చిలుముల సాగర్, కుక్క శ్రీనివాస్‌లను నియమించారు. నూతన కార్యవర్గం పార్టీ బలోపేతానికి, ఎస్సీ మోర్చా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

Comments 0