రాయికల్: శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనుల్లో భాగంగా మంగళవారం స్లాబ్ నిర్మాణ పనులను పలువురు ప్రముఖులు పరిశీలించారు. భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు బోడుగం మోహన్ రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు మచ్చ నారాయణ, డా. తురగ రాజారెడ్డి, బండారు కమలాకర్ రావు, జిల్లా విద్యాపీఠం కార్యదర్శి కూర్మ పెద్ద మల్లారెడ్డి, గాజేంగి అశోక్, బొమ్మకంటి రాంగోపాల్, కడకుంట్ల ప్రభాకర్, మామిడాల లక్ష్మీనారాయణ, బిరుదరాజు సుభాష్ రాజు, చౌడారపు సతీష్, సింగు నరేష్ తదితరులు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నిర్మాణ కార్యక్రమానికి అవసరమైన సహకారం, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. విద్యా సేవకు చేయూతనందిస్తూ శ్రీ సరస్వతీ శిశు మందిరం అభివృద్ధి, భవన నిర్మాణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు.

Comments 0