రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో సెప్టెంబర్ 23న జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి గ్రామంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఆయుర్వేద వైద్య విధానం, దాని విశిష్టత, ప్రాచీన జీవనశైలి ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పలువురు ప్రముఖులు సూచించారు. అనంతరం శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా శిక్షకుల పర్యవేక్షణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సూర్య నమస్కారాలు, ప్రాణాయామం సాధన చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సునీత, గ్రామ సర్పంచ్ గౌతమి–వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్, ఫార్మాసిస్ట్ జ్యోతి, ఆశా వర్కర్ లక్ష్మి, యోగా శిక్షకులు లింగమూర్తి, శ్రీధర్, సమత పాల్గొన్నారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, రవికుమార్, రాజశేఖర్, రాజన్న, శంకరయ్య, మల్లారెడ్డి, గ్రామ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comments 0